సినిమా పరిశ్రమ పెద్దలతో పేర్ని నాని సమావేశం
విధాత: ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. సమావేశంలో సినిమా నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు పాల్గొననున్నారు. ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ, కోవిడ్ వల్ల సినిమా పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులపై సమావేశంలో చర్చించనున్నారు. ఆన్‌లైన్ టికెట్‌పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నేటి సమావేశంలో ఆన్‌లైన్ సినిమా టికెట్ అంశంపై కొంత స్పష్టత వచ్చే […]

విధాత: ఉదయం 11 గంటలకు ఏపీ సచివాలయంలో తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలతో ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని సమావేశం కానున్నారు. సమావేశంలో సినిమా నిర్మాతలు, ప్రదర్శనకారులు, పంపిణీదారులు పాల్గొననున్నారు. ఆన్‌లైన్ టికెట్ వ్యవస్థ, కోవిడ్ వల్ల సినిమా పరిశ్రమకు ఎదురైన ఇబ్బందులపై సమావేశంలో చర్చించనున్నారు. ఆన్‌లైన్ టికెట్‌పై ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేదని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. నేటి సమావేశంలో ఆన్‌లైన్ సినిమా టికెట్ అంశంపై కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.