మహిళ పై ఫోటోగ్రాఫ‌ర్ దాడి

విధాత‌: అనంతపురం నగరంలో మహిళ ఉద్యోగిపై ఒక ప్రైవేట్ ఫోటో గ్రాఫర్ దాడి…ఆపై అసభ్య పదజాలంతో దూషించడంతో మహిళ క‌న్నీటిప‌ర్వతమైంది.వివరాల్లోకి వెళితే యస్ ఆర్ గ్రాండ్ హోటల్ లో ఒక వివాహం జరుగుతుంది…ఆ వివాహంకు వచ్చిన ఒక ఫోటో గ్రాఫర్ లిఫ్ట్ లోవెళ్లే విషయంలో పక్కన ఉన్న లిఫ్ట్ లో వెళ్ళాలి మీరు వచ్చిన ఈ లిఫ్ట్ లో వెళ్లడం కుదరదు అని అక్కడ పని చేసే మహిళ అతనికి సూచించింది.అంతే..కోపోద్రీక్తుడైన ఆ ఫోటో గ్రాఫర్ నేను […]

మహిళ పై ఫోటోగ్రాఫ‌ర్ దాడి

విధాత‌: అనంతపురం నగరంలో మహిళ ఉద్యోగిపై ఒక ప్రైవేట్ ఫోటో గ్రాఫర్ దాడి…ఆపై అసభ్య పదజాలంతో దూషించడంతో మహిళ క‌న్నీటిప‌ర్వతమైంది.వివరాల్లోకి వెళితే యస్ ఆర్ గ్రాండ్ హోటల్ లో ఒక వివాహం జరుగుతుంది…ఆ వివాహంకు వచ్చిన ఒక ఫోటో గ్రాఫర్ లిఫ్ట్ లోవెళ్లే విషయంలో పక్కన ఉన్న లిఫ్ట్ లో వెళ్ళాలి మీరు వచ్చిన ఈ లిఫ్ట్ లో వెళ్లడం కుదరదు అని అక్కడ పని చేసే మహిళ అతనికి సూచించింది.అంతే..కోపోద్రీక్తుడైన ఆ ఫోటో గ్రాఫర్ నేను ఈ లిఫ్ట్ లోనే వెళ్ళాలి నువ్వు చెబితే పక్క లిఫ్ట్ ఎక్కలా అని ఆ మహిళ ను అసభ్య పదజాలంతో దూషించాడు…అంతటితో ఆగకుండా చెయ్ చేసుకుని దౌర్జన్య‌నికి దిగాడు…శుభకార్యం జరుగుతున్న స‌మ‌యంలో అందరికి ఇబ్బంది అవుతుందని మహిళ దుఖఃన్నీ అపుకుంది…శుభకార్యం ముగిశాక తోటి సిబ్బంది విషయం తెలుసుకుని ఫోటో గ్రాఫర్ ని మందలించారు.
దీంతో ఆ ఫోటో గ్రాఫర్ తోటి యూనియన్ స‌భ్యుల‌తో ధర్నా చేసి మహిళ పైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూన్నాడు..ఒక మహిళ పై చెయ్ చేసుకోవడమే కాకుండా త‌న‌ పైనే చర్యలు తీసుకోవాలని సభ్యసమాజం తలదించుకునే విధంగా అతడు ప్రవర్తిస్తున్నాడని అధికారులు విచారించి చర్యలు తీసుకోవాలని అక్క‌డి సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు.కోవిడ్ సమయంలో జిల్లా వ్యాప్తంగా పోలీసులకు,మెడికల్ సిబ్బందికి ఉచితంగా భోజనాలు అందించే విషయంలో ఆ మహిళ చురుకుగా ప‌నిచేసింది.. అలాంటి మహిళకు న్యాయం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.