పోలవరానికి 8 ఏళ్లలో ఇచ్చిన నిధులు.. రూ.11,182 కోట్లు మాత్రమే

విధాత‌:ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయినిగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది.వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు..కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా ..2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం రూ.11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితులకు పునరావాసం,పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను […]

పోలవరానికి 8 ఏళ్లలో ఇచ్చిన నిధులు.. రూ.11,182 కోట్లు మాత్రమే

విధాత‌:ఆంధ్రప్రదేశ్‌ వరప్రదాయినిగా నిర్మితమవుతున్న పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ వేదికగా కీలక ప్రకటన చేసింది.వైఎస్సార్‌ కాంగ్రెస్‌​ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు..కేంద్ర ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్‌ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించిన దరిమిలా ..2014 నుంచి ఇప్పటివరకు కేంద్రం రూ.11,182 కోట్ల రూపాయల నిధులు ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రాజెక్ట్‌లోని ఇరిగేషన్‌ పనులకు మాత్రమే ఈ నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు.

పోలవరం నిర్వాసితులకు పునరావాసం,పునఃనిర్మాణం పనులతోపాటు ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి మొత్తం రూ.55,657 కోట్లు ఖర్చవుతుందని సవరించిన అంచనాలు చెబుతుంటే.. 8 ఏళ్ల వ్యవధిలో కేంద్రం ఇచ్చింది కేవలం రూ.11,182 కోట్లు మాత్రమేనని మంత్రి తెలిపిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.