రాయలసీమ గృహసత్యాగ్రహం

సాహిత్య, సాంస్కృతిక కళా రంగాలు, విద్యావంతులు, మేధావులుగా భాగస్వామ్యమై జయప్రదం చేద్దాం. సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన 5 వ వార్షికోత్సవం సందర్భంగా… "రాయలసీమ వ్యక్తి సత్యాగ్రహం" 31,మే 2021, ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 వరకు నిర్వహించాలని రాయలసీమ ప్రజాసంఘాల నిర్ణయించాయి.వేలాదిమంది సీమ ప్రజలు స్వచ్చందగా చిన్న చిన్న సీమ ప్రజా సంఘాల ఆద్వర్యంలో సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కోసం 31 మే, 2016 న ఉద్యమం సాగించారు.ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం […]

రాయలసీమ గృహసత్యాగ్రహం

సాహిత్య, సాంస్కృతిక కళా రంగాలు, విద్యావంతులు, మేధావులుగా భాగస్వామ్యమై జయప్రదం చేద్దాం.

సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన 5 వ వార్షికోత్సవం సందర్భంగా… “రాయలసీమ వ్యక్తి సత్యాగ్రహం” 31,మే 2021, ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 1-00 వరకు నిర్వహించాలని రాయలసీమ ప్రజాసంఘాల నిర్ణయించాయి.
వేలాదిమంది సీమ ప్రజలు స్వచ్చందగా చిన్న చిన్న సీమ ప్రజా సంఘాల ఆద్వర్యంలో సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కోసం 31 మే, 2016 న ఉద్యమం సాగించారు.
ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం మే- 31 న సిద్దేశ్వరం వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ సీమ సమస్యల పరిష్కారానికి సీమ ప్రజా సంఘాల కృషి చేస్తున్నాయి. 2017 లో
నంద్యాల బహిరంగ సభ, 2018 లో సిద్దేశ్వరం వాహన ర్యాలీ,
2019 లో సిద్దేశ్వరం పాదయాత్ర,
2020 లో 400 పైగా కేంద్రాలలో నిరసనలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఇతర సందర్భాలలోను విస్తృతంగా సీమ‌ ప్రజా చైతన్య కార్యక్రమాలు, ఉద్యమాలు చేస్తువస్తున్నాయి. రాయలసీమ సాంస్కృతిక ఉద్యమం కూడా ప్రధాన ఉద్యమ స్రవంతికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వస్తోంది.
ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో “సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేయాలని, నికర జలాలు కేటాయించాలని, ఇతర కీలక సాగునీటి ప్రాజెక్టుల సమస్యలు, పాలన అభివృద్ధి వికేంద్రీకరణ, ఉక్కుకర్మాగారం, వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ, కీలక సంస్థల ఏర్పాటు తదితర అంశాల సాధనా లక్ష్యంగా “రాయలసీమ వ్యక్తి సత్యాగ్రహం” చేపట్టాలని నిర్ణయించారు.
ఈ సంవత్సరం కరోనా నేపథ్యంలో తమ ఇంటి పట్టునే ఉంటూ కుటుంబ సభ్యులతో మన ప్రధాన సమస్యలను, స్థానిక సమస్యలను తెల్లకాగితాలలో, అట్టలపై రాసి ఇంట్లోనే సత్యాగ్రహం నిర్వహించాలని మనవి.
ప్రధాన డిమాండ్ లతో సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులకు మెయిల్ లేదా లేఖల ద్వారా పంపాలని మనవి.
సీమలోని సాహిత్య సంఘాలు, కళారంగాలు, విద్యావంతులు, మేధావులు, అభిమానులు అందరం సీమ ప్రజా సంఘాల జీవన పోరాటానికి మద్దతుగా నిలుద్దాం.
సీమేతరులు కూడా ఈ ఈ కరువు సీమ మానవీయ పోరాటానికి సంఘీబావం ప్రకటించాలని మనవి చేస్తున్నాం.
మీ సంఘాలు పేరుతోనే ఈ కార్యక్రమం చేయవచ్చు. లేదా వ్యక్తిగతంగా అయినా కుటుంబ సభ్యులతో మద్దతు గా సత్యాగ్రహం చేయాలని మనవి.
మీ సత్యాగ్రహ పోటో, వివరాలు “94444 02770” Watsap నెంబర్ పంపాలని మనవి.
రాయలసీమ కోసం రాద్దాం.
రాయలసీమ కోసం మాట్లాడుదాం.

రాయలసీమ కోసం అవసరమైన సమయంలో భాగస్వామ్యమవుదాం.

రాయలసీమ సాంస్కృతిక వేదిక,
వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం,
రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక.