విజయనగరంలో రైలు ప్రమాదం.. భారీగా రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. మరికొన్ని దారి మళ్లింపు..!

విజయనగరంలో రైలు ప్రమాదం.. భారీగా రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే.. మరికొన్ని దారి మళ్లింపు..!

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదం నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే రాయగడ, పలాస ప్యాసింజర్‌ రైళ్లతో పాటు మరికొన్ని ట్రైన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో పలు రైళ్లను దారి మళ్లించింది. రద్దయిన రైళ్లలో గుంటూరు – రాయగడ (రైలు నంబర్‌ 17243), గుంటూరు – విశాఖపట్నం (17239), కాకినాడ పోర్ట్‌-విశాఖ‌పట్నం ( 17267), విశాఖపట్నం – కాకినాడ పోర్ట్ (17268) రాజమండ్రి – విశాఖపట్నం( 07466), విశాఖపట్నం- రాజమండ్రి (07467), విజయవాడ-విశాఖపట్నం ( 12718), విశాఖపట్నం-విజయవాడ ( 12717) రద్దు చేసినట్లు పేర్కొంది.


బరౌనీ – కోయంబత్తూరు (03357) మధ్య నడిచే రైలును తిత్లిఘర్‌, రాంచీ, నాగ్‌పూర్‌, బలార్షా, విజయవాడ మీదుగా దారి మళ్లించారు. టాటానగర్‌ – ఎర్నాకుళం (18189) రైలును గొట్లం, తిత్లినగర్‌, నాగపూర్‌, బలార్షా, విజయవాడ మీదుగా దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. భువనేశ్వర్ – ముంబయి (11020) రైలుతో పాటు హౌరా-సికింద్రాబాద్ (12703) రైలును విజయనగరం, తిత్లిఘర్‌రాంచీ, నాగరపూర్‌ కాజీపేట మీదుగా.. హౌరా-బెంగళూరు (12245) ట్రైన్‌ను విజయనగరం, తిత్లిఘర్‌, రాంచీ, నాగపూర్‌, బలార్షా, విజయవాడ మీదుగా మళ్లిస్తున్నట్లు తెలిపింది. అలాగే సంబల్‌పూర్‌ – నాందేడ్‌ (20809) రైలును విజయనగరం వరకు మాత్రమే పరిమితం చేసినట్లు పేర్కొంది.


పూరి – తిరుపతి (17479) రైలును బాలుగావ్‌ మీదుగా నడుపనున్నట్లు చెప్పింది. ముంబయి-భువనేశ్వర్ (11019) రైలును విశాఖపట్నం వరకు పరిమితం చేసింది. భువనేశ్వర్- ముంబయి (11020) రైలును భువనేశ్వర్-విశాఖపట్నం మధ్య రద్దు చేసింది. హౌరా-బెంగళూరు (12863), హౌరా-పుదుచ్చేరి(12867), హౌరా-చెన్నై సెంట్రల్(12839), షాలిమార్‌-త్రివేండ్రం (22642) రైళ్లను రీ షెడ్యూల్‌ చేసింది.



మంగళూరు-సంత్రగాచి (22852), బెంగుళూరు-హౌరా (12246), తిరుపతి -హౌరా (20890), సికింద్రాబాద్ – హౌరా (12704), బెంగుళూరు – హౌరా (12864), బెంగుళూరు – జస్దిహ్ (22305), కన్యాకుమారి – బెంగుళూరు (22503) చెన్నై సెంట్రల్- హౌరా ( 12840), వాస్కోడ గామా- షాలిమార్ (18048) , అగర్తలా – బెంగుళూరు (12504), హతియా -బెంగళూరు (12835) రైళ్లను దారి మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.


ఇదిలా ఉండగా.. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద ట్రాక్‌పై ఆగి ఉన్న ప్యాసింజర్‌ రైలును వెనుక నుంచి వచ్చిన మరో రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో మూడు బోగీలు పట్టాలు తప్పాయి. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో 14 మంది వరకు మృతి చెందారు. దాదాపు 50 మందికిపైగా గాయపడ్డారు. ప్రస్తుతం సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఇటీవల వరుసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు అందరినీ కలవరానికి గురి చేస్తున్నాయి. ఒడిశా బాలాసోర్‌ రైలు ప్రమాదంలో దాదాపు 290 మందికిపైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.