ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..జలపాతంలో పడి ముగ్గురి మృతి

అనంతగిరిలో జలపాతంలో సెల్ఫీలు తీసుకుంటూ జారి ముగ్గురు బాలికలు మృతి చెందారు. రీల్స్, సెల్ఫీ పిచ్చి మళ్లీ ప్రాణాలు తీసిన ఘటన కలచివేసింది.

Reported by: Tejaswini Nanna | ఆంధ్ర ప్రదేశ్ | Apr 09, 2026, 5:09 pm IST
Read Time: 2 mins
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా..జలపాతంలో పడి ముగ్గురి మృతి

విధాత : సెల్పీలు, రీల్స్ పిచ్చితో యువత ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నాయి. అయినా యువత వాటికి దూరంగా ఉండలేకపోతున్నారు. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మూలగుమ్మిలో జలపాతంలో పడి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతులను హుకుంపేట మండలం జుంబువలసకు చెందిన త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16)గా గుర్తించారు.

జలపాతంలో స్నానానికి వెళ్లిన జంబవలసకు చెందిన నలుగురు బాలికలు ఫోన్‌లో సెల్ఫీలు తీసుకుంటూ ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి పోయారు. పెద్ద బండరాయిపై ఫోటోలు తీసుకుంటూ వారు జారీ పడ్డారు. అందులో వారిలో ముగ్గురు బాలికలు మృతి చెందారు. ఒకరు ప్రాణాతో బయటపడ్డారు.

ఇవి కూడా చదవండి :

కేటీఆర్ ఆహ్వానం..బీఆర్ఎస్ లోకి జీవన్ రెడ్డి !
Senior Stars | జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్న 60 ప్లస్ హీరోలు… బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న సీనియర్ స్టార్స్!