రమ్య హంతకులను కఠినంగా శిక్షించాలి. SFI – AIDWA – DYFI

విధాత‌: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుంటూరు నగరంలో బీటెక్ విద్యార్థిని రమ్య పై ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని ఎస్ఎఫ్ఐ, ఐద్వా ,డివైఎఫ్ఐ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ స్థానిక లెనిన్ సెంటర్ లో కొవ్వుత్తుల నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ 75 ఎళ్ల స్వాతంత్రంలో మహిళ పై దాడులు జరగడం సిగ్గుచేటని […]

రమ్య హంతకులను కఠినంగా శిక్షించాలి. SFI – AIDWA – DYFI

విధాత‌: స్వాతంత్య్ర దినోత్సవం రోజున గుంటూరు నగరంలో బీటెక్ విద్యార్థిని రమ్య పై ప్రేమోన్మాది అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని ఎస్ఎఫ్ఐ, ఐద్వా ,డివైఎఫ్ఐ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ స్థానిక లెనిన్ సెంటర్ లో కొవ్వుత్తుల నిరసన చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి. రమాదేవి, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సూర్యారావు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ 75 ఎళ్ల స్వాతంత్రంలో మహిళ పై దాడులు జరగడం సిగ్గుచేటని అన్నారు. దాడి జరిగిన వెంటనే పరిహారం ప్రకటించడం చేతులు దులుపుకోవడం ప్రభుత్వాలు చేస్తున్నాయని. దాడులను ఆపేందుకు పరిష్కార మార్గాలు ఆలోచన చేయడం లేదని వాపోయారు. రాష్ట్రంలో ఉన్న ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ లు, దిశా పోలీస్ స్టేషన్లు, దిశా యాప్ లు రమ్యను కాపాడు కోలేకపోయాయని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మహిళలపై జరిగే దాడులను అరికట్టేందుకు పాఠ్య0శాలలో లైంగిక వివక్షపై అవగాహన పెంచాలని, చట్టాలను పటిష్ఠ పరచాలని, విద్యా కేంద్రాలలో పర్వక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే రమ్య కుటుంబానికి 25 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని, రమ్య సోదరికి ఉద్యోగం ఇవ్వాలని, స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ, ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్సులు ఎన్. కోటి, ఎం.సోమేశ్వరరావు, ఎన్. నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు ఓ.ఏసుబాబు, నాయకులు రాధకృష్ణ, ప్రణీత, ఐద్వా నాయకులు పాలవెల్లి, డివైఎఫ్ఐ నాయకులు నిజం తదితరులు పాల్గొన్నారు