SDGI,MPIపై రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్కుషాపు

విధాత‌:అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21మరియు మల్టీడైమెన్సనల్ పోవర్టీ ఇండెక్స్(MPI)పై రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్కుషాపు. ఈకార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ ఆడ్వయిజర్(SDGs) సాన్యుక్తా సమాదార్ (Sanyukta Samaddar) రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి ఎస్ఆర్కె విజయకుమార్,టిఇర్ఆండ్బి, విద్యా, స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు,బి.రాజశేఖర్,ఎఆర్ […]

  • Publish Date - August 12, 2021 / 09:08 AM IST

విధాత‌:అమరావతి సచివాలయం ఐదవ బ్లాకులో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ 2020-21మరియు మల్టీడైమెన్సనల్ పోవర్టీ ఇండెక్స్(MPI)పై రెండు రోజుల రాష్ట్ర స్థాయి వర్కుషాపు.

ఈకార్యక్రమంలో పాల్గొన్న నీతి ఆయోగ్ ఆడ్వయిజర్(SDGs) సాన్యుక్తా సమాదార్ (Sanyukta Samaddar) రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ప్రణాళికా శాఖ కార్యదర్శి జి ఎస్ఆర్కె విజయకుమార్,టిఇర్ఆండ్బి, విద్యా, స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు కృష్ణ బాబు,బి.రాజశేఖర్,ఎఆర్ అనురాధ, కాంతిలాల్ దండే,ఇంకా వివిధ శాఖల నోడలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈకార్యక్రమానికి తొలుత రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యదర్శి జీఎస్ఆర్కె విజయకుమార్ స్వాగతం పలికారు.నీతి ఆయోగ్ ఆడ్వయిజర్ సాన్యుక్తా సమాదార్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ దేశ వ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ఈవిధమైన వర్కు షాపులు పూర్తి చేశామని తెలిపారు.

నీతి ఆయోగ్ నోడల్ ఏజెన్సీ గా ఈసస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్ ను మానిటర్ చేస్తోందని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ 17 సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్స్(SDGs) ఏర్పాటు చేసుకుని వాటిని అధిగమించేందుకు కృషి చేస్తోందని చెప్పారు.

SDG ఇండియా ఇండెక్స్ రిపోర్ట్ 2020 ప్రకారం ఎపి ఆపార్డబుల్ అండ్ క్లీన్ ఎనర్జీ SDG7 అంశంలో లో దేశంలో మొదటి స్థానంలోను, గోల్-14 లైఫ్ బిలో వాటర్ అంశంలో రెండవ స్థానంలోను,SDG6 క్లీన్ వాటర్ అండ్ శానిటేషన్ అంశంలో 4వస్థానంలోను,SDG5 జెండర్ ఈక్వాలిటీ అంశంలో 5వస్థానం లోను నిలిచిందన్నారు.