భగ్గుమన్న విద్యార్థి సంఘాలు..జాబ్ క్యాలెండర్‌పై నిరసన
మంత్రుల నివాసాల ముట్టడికి యత్నంవిధాత,అమరావతి: ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై రాష్ట్రంలోని పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన చేపట్టారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో నామమాత్రంగా ఖాళీ పోస్టులను చూపించారని ఆరోపించారు. వేల సంఖ్యలో ఉన్న ఖాళీలతో కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ […]

మంత్రుల నివాసాల ముట్టడికి యత్నం
విధాత,అమరావతి: ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై రాష్ట్రంలోని పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన చేపట్టారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌లో నామమాత్రంగా ఖాళీ పోస్టులను చూపించారని ఆరోపించారు. వేల సంఖ్యలో ఉన్న ఖాళీలతో కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం ఆధ్వర్యంలో నేతలు యత్నించారు. కడపలో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, తిరుపతిలోమంత్రి పెద్దిరెడ్డి, విజయనగరంలో మంత్రి బొత్స, విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్ ఇళ్లను ముట్టడించేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరులో ఆందోళనకు దిగిన విద్యార్థి నేతలను అదుపులోకి తీసుకున్నారు.