చెన్నుపాటి ఉషారాణి అరెస్ట్

విధాత‌: టీడీపీ నాయకురాలు చెన్నుపాటి ఉషారాణిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసేందుకు మహిళా పోలీసులు భారీగా మోహరించారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్లు ఏమయ్యాయంటూ ఉషారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెమోరండం సమర్పించడానికి వెళితే అరెస్టు చేస్తారా? అని ప్రశ్నించారు. దిశ సెక్షన్‌ని అమలు చేయాలంటూ కోరుతున్న వినతి పత్రాన్ని ఇచ్చేందుకు దిశ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు అనుమతించలేదు.