పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన

విధాత,విజయవాడ: పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ టీడీపీ సోమవారం ఆందోళనలు చేపట్టింది. మేయర్ చాంబర్ వద్ద టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మికి విపక్ష కార్పొరేటర్లు వినతి పత్రం అందచేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో పనులు లేక పేదలు పస్తులు ఉంటున్నారన్నారు. ఉపాధి లేక అల్లాడుతున్న వారిపై భారాలు మోపడం అన్యాయమన్నారు. విలువ ఆధారిత […]

పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ టీడీపీ ఆందోళన

విధాత,విజయవాడ: పన్నుల భారాలను వ్యతిరేకిస్తూ టీడీపీ సోమవారం ఆందోళనలు చేపట్టింది. మేయర్ చాంబర్ వద్ద టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెంచిన పన్నుల భారాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం మేయర్ భాగ్యలక్ష్మికి విపక్ష కార్పొరేటర్లు వినతి పత్రం అందచేశారు. టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో పనులు లేక పేదలు పస్తులు ఉంటున్నారన్నారు. ఉపాధి లేక అల్లాడుతున్న వారిపై భారాలు మోపడం అన్యాయమన్నారు. విలువ ఆధారిత ఆస్తి పన్ను‌ వల్ల పది రెట్ల భారం పడుతుందని చెప్పారు. చెత్త పన్ను వేయడం… ప్రభుత్వం చెత్త నిర్ణయాలలో ఒకటి అని వ్యాఖ్యానించారు. సీపీఎం ఫ్లోర్ లీడర్ బోయ సత్తిబాబు మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం పేరుతో మాటలు చెప్పి మోసం చేశారన్నారు. జగనన్న పాలనలో పేదలకు పనులే లేకుండా పోయాయని తెలిపారు. ఆదుకోవాల్సిన సమయంలో పన్నుల భారాలు మోపుతారా అని ప్రశ్నించారు. మోదీ ఆదేశాలను జగన్మోహన్ రెడ్డి పాటిస్తున్నారని ఆరోపించారు. కౌన్సిల్‌లో చర్చ పెట్టి ఆమోదించకుండా పన్నులు ఎలా పెంచుతారని నిలదీశారు. పన్నుల‌ భారాలు రద్దు చేసే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.