జగన్ అండ చూసుకొని ఓవరాక్షన్ చేసే పోలీసులకి భవిష్యత్ లో భంగపాటు తప్పదు
విధాత: ఆడబిడ్డలకు న్యాయం చేయాలని దిశ పోలీస్ స్టేషన్ల ముందు నిరసనకు దిగిన తెలుగు మహిళా, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు, పోలీసులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు.తిరుపతిలో పోలీసులు వ్యవహరించిన తీరు హేయం. అరెస్టు చేసిన నేతలను తక్షణమే విడుదల చేసి, చేయి చేసుకున్న పోలీసులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడైన శ్రీరామ్ చిన్నబాబుపై చేయి […]

విధాత: ఆడబిడ్డలకు న్యాయం చేయాలని దిశ పోలీస్ స్టేషన్ల ముందు నిరసనకు దిగిన తెలుగు మహిళా, తెలుగు యువత, టీ.ఎన్.ఎస్.ఎఫ్ నేతల అరెస్టులు, పోలీసులు చేయి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు.తిరుపతిలో పోలీసులు వ్యవహరించిన తీరు హేయం. అరెస్టు చేసిన నేతలను తక్షణమే విడుదల చేసి, చేయి చేసుకున్న పోలీసులపై 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు.
బీసీ వర్గానికి చెందిన యువ నాయకుడైన శ్రీరామ్ చిన్నబాబుపై చేయి చేసుకుంటారా? తాడేపల్లి ఆదేశాలతోనే బీసీ నేతలను అణచాలని చూస్తున్నారు. పోలీసులు వేసుకుంది జగన్ చొక్కాలు కాదు.. ఖాకీ చొక్కాలన్న విషయం గుర్తుంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఓవరాక్షన్ చేసే పోలీసులకు భవిష్యత్ లో భంగపాటు తప్పదని హెచ్చరించారు.