చేయుత పేరుతో మహిళా లోకాన్ని వంచించిన జ‌గ‌న్

అమరావతి:మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు కొల్లు రవీంద్ర మీడియాతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేయూత పేరుతో బీసీలను మోసం చేస్తున్నారన్నారు. ఎన్నిక‌ల్లో ఓట్ల‌ కోసం కల్లబొల్లి హామీలిచ్చి…. అధికారంలోకి రాగానే ఆ హ‌మీల‌ను దాట వేస్తున్నారు.పాదయాత్రలో మ‌హిళా లోకానికి ఇచ్చిన‌ హామీపై నేడు మట త‌ప్పి, మడమ తిప్పి మ‌హిళ‌ల‌కు ఇవ్వాల్సిన‌ 18 వేలు ఎగ్గొట్టారు,ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌హిళ‌ల‌కు చేయుతంటూ వారికి రావాల్సిన వాటిల్లో చేతివాటం చూపుతున్నారు. అమూల్ కు పాలు, అల్లానా కంపెనీకి మాంసం […]

చేయుత పేరుతో మహిళా లోకాన్ని వంచించిన జ‌గ‌న్

అమరావతి:మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యులు కొల్లు రవీంద్ర మీడియాతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ చేయూత పేరుతో బీసీలను మోసం చేస్తున్నారన్నారు.

ఎన్నిక‌ల్లో ఓట్ల‌ కోసం కల్లబొల్లి హామీలిచ్చి…. అధికారంలోకి రాగానే ఆ హ‌మీల‌ను దాట వేస్తున్నారు.పాదయాత్రలో మ‌హిళా లోకానికి ఇచ్చిన‌ హామీపై నేడు మట త‌ప్పి, మడమ తిప్పి మ‌హిళ‌ల‌కు ఇవ్వాల్సిన‌ 18 వేలు ఎగ్గొట్టారు,ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మ‌హిళ‌ల‌కు చేయుతంటూ వారికి రావాల్సిన వాటిల్లో చేతివాటం చూపుతున్నారు.

అమూల్ కు పాలు, అల్లానా కంపెనీకి మాంసం కమిషన్ల కోసం కాదా?.టీడీపీ హయాంలో మ‌హిళ‌ల‌ను వ్యాపారంగంలో ప్రోత్స‌హించేందుకు 2 లక్షల వ‌ర‌కు ఆర్థిక చేయ‌త ల‌భించేది, 45 ఏళ్ల‌కే పెన్ష‌న్ ఇస్తాన‌న్న ముఖ్య‌మంత్రి నేడు పెన్ష‌న్ మాట మార్చి ఇప్పుడు కేవ‌లం 18 వేలు ఇచ్చి చేతులు దులుపు కుంటున్నారు
చేయుత అంటూ జగన్ ఇస్తున్న‌18 వేలతో మహిళలు ఏం వ్యాపారం చేయొచ్చో ముఖ్య‌మంత్రి సమాధానం చెప్పాలి.

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ సంక్షేమం పేరుతో బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల‌ను వంచించడం మానుకోవాలి,జాబ్ క్యాలెండర్ అంటూ నిరుద్యోగ‌ల‌ను మోసం చేయాల‌ని జ‌గ‌న్ చుస్తున్నారు.వైసీపీ ప్ర‌భుత్వంపై రాష్ట్రంలోని యువ‌త తిరుగ‌బాటు చేస్తున్నారు,చేయుత పేరుతో మహిళా లోకాన్ని వంచించినందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వారికి క్షమాపణలు చెప్పాలి.మ‌హిళ‌ల‌కు జ‌రుగుతున్న అన్యాయంపై తెలుగుదేశం పార్టీ పొరాటం చేస్తుందని అన్నారు.

Readmore:మహిళా ఓటర్ల పెరుగుదలలో ఏపీ టాప్‌