తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారి అధ్యక్షతన జరిగింది. క్రింది తీర్మానాలను ఆమోదించడమైంది. తెలుగుదేశంపార్టీ మహానాడు మే 27, 28 తేదీలలో గత ఏడాదిలాగే డిజిటల్‌ ప్లాట్‌ఫారంలో జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించడమైంది. బనగానపల్లె మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్థనరెడ్డి మరియు తెలుగుదేశం కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల్ని, అక్రమ అరెస్టుల్ని ఖండించింది. తెలుగుదేశం మాజీ శాసనసభ్యుని ఇంటి సమీపంలో వైసీపీ గూండాలు దాడి చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి టీడీపీ నేతలపై ఎదురు […]

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం

తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సమావేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుగారి అధ్యక్షతన జరిగింది. క్రింది తీర్మానాలను ఆమోదించడమైంది.

  1. తెలుగుదేశంపార్టీ మహానాడు మే 27, 28 తేదీలలో గత ఏడాదిలాగే డిజిటల్‌ ప్లాట్‌ఫారంలో జరపాలని ఏకగ్రీవంగా నిర్ణయించడమైంది.
  2. బనగానపల్లె మాజీ శాసనసభ్యుడు బీసీ జనార్థనరెడ్డి మరియు తెలుగుదేశం కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసుల్ని, అక్రమ అరెస్టుల్ని ఖండించింది. తెలుగుదేశం మాజీ శాసనసభ్యుని ఇంటి సమీపంలో వైసీపీ గూండాలు దాడి చేసి దాన్ని కప్పిపెట్టుకోవడానికి టీడీపీ నేతలపై ఎదురు కేసులు పెట్టారు. టీడీపీ ఇచ్చిన కంప్లయింట్‌పై కేసు నమోదు చేయలేదు. రాజకీయ కక్ష సాధింపునకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని జగన్‌రెడ్డి ప్రభుత్వం దుర్వినియోగం చేయడాన్ని పోలిట్‌బ్యూరో ఖండించింది. ప్రజాస్వామ్యాన్ని బ్యాక్‌స్లైడ్‌ చేయకూడదని, ప్రతిపక్షాల్ని దెబ్బతీయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని ఇటీవలే హైకోర్టు తీర్పు చెప్పింది. అయినా ఉన్నత న్యాయస్థానాల తీర్పుల్ని లెక్కచేయకుండా బనగానపల్లె పోలీసు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడి మాజీ శాసనసభ్యుడు జనార్థనరెడ్డిపై అట్రాసిటీ కేసు పెట్టడాన్ని పోలిట్‌బ్యూరో తీవ్రంగా ఖండించడమైంది.
  3. కరోనా బాధితులకు భరోసా ఇవ్వడానికి, సహాయం చేయడానికి ప్రభుత్వ ఆసుపత్రుల సందర్శనానికి బయలుదేరిన దాదాపు 40 మంది టీడీపీ నేతల్ని గృహనిర్బంధం చేయడం, అక్రమ అరెస్టులు చేయడాన్ని నిరసించడమైంది.
  4. కృష్ణపట్నంలో ఆనందయ్య యాదవ్‌ 70 వేల మందికి మందు సరఫరా చేసినట్టు, ఫిర్యాదు ఏ కరోనా బాధితుడు చేయనట్టు వార్తలొచ్చాయి. ఈ మందువల్ల ప్రమాదం లేదని ఆయుష్‌ వారు ప్రకటించారు. ఏ సైడ్‌ఎఫెక్ట్‌ లేదని ఎన్నో ఏళ్లుగా ఆనందయ్య గారి మందును వేల మంది వాడుతున్నారు. వైకాపా డ్రగ్‌ మాఫియా వత్తిడితో జగన్‌రెడ్డి ప్రభుత్వం మందు పంపిణీ నిలిపివేయడాన్ని ఖండించడమైంది. ఆనందయ్య యాదవ్‌ను అప్రకటిత నిర్బంధంలో పెట్టడాన్ని పోలిట్‌బ్యూరో నిరసించడమైంది.
    ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, వర్ల రామయ్య, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, నక్కా ఆనంద్‌బాబు, బోండా ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.