విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు
విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని యోచన. గత ఏడాది కూడా ఇంటర్ పరీక్షలు నిర్వహించాం.పరిస్థితులు చక్కబడితే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం.ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వాక్సిన్ కోసం కేంద్రం శ్రద్ద చూపి ప్రత్యేక కోటా ఇవ్వాలి.కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలు పాటిస్తాం.అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల వీడియో కాన్ఫెరెన్స్ లో మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ […]

విద్యార్థుల భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాలని యోచన.
గత ఏడాది కూడా ఇంటర్ పరీక్షలు నిర్వహించాం.పరిస్థితులు చక్కబడితే పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధం.ఉపాధ్యాయులు, లెక్చరర్లకు వాక్సిన్ కోసం కేంద్రం శ్రద్ద చూపి ప్రత్యేక కోటా ఇవ్వాలి.కేంద్రం ఇచ్చే మార్గదర్శకాలు పాటిస్తాం.అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రుల వీడియో కాన్ఫెరెన్స్ లో మంత్రి ఆదిమూలపు సురేష్.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ తో పాటు వివిధ ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నామని, గత ఏడాది కూడా కోవిడ్ నిబంధనలు పాటించి పరీక్షలు నిర్వహించుకున్నామని ఆయన అన్నారు. ఆదివారం
అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయిసమావేశం జరిగింది. సమావేశంలో కేంద్ర మంత్రులు రమేష్ పొక్రియల్ నిశాంక్, స్మృతిఇరానీ, సంజయ్ దొత్రే, ప్రకాష్ దేవకర్, గోవా, జార్ఖండ్ ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. సమావేశానికి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హాజరై మాట్లాడారు. 12 వ తరగతి పరీక్షలు, వివిధ ఎంట్రెన్స్ ల నిర్వహణపై సమావేశంలో చర్చించారు.
మంత్రి సురేష్ మాట్లాడుతూ….
కేంద్ర మార్గదర్శకాలు అనుసరించి ఈ విద్యా సంవత్సరం నుంచే ఏపీ లో సీబీఎస్ఈ విధానం అమలు చేసెందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం మేరకు సిద్ధంగా ఉన్నాం.ఇంటర్మీడియట్ పరీక్షలు నిరవిహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం.
కోవిడ్ పరిస్థితులు దృష్ట్యా ప్రోటో్కాల్ పాటిస్తూ అన్ని పరీక్షా కేంద్రాల్లో శానిటేషన్ చేస్తూ ప్రతి చోటా ఒక ఐసోలేషన్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకున్నాం.కేంద్రం నుంచి పరీక్షల విషయం లో అన్ని రాష్ట్రాలకు ఒక విధానం పై ఏదయినా ఆదేశాలు వస్తాయని భావించాం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు., ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఉపాధ్యాయులకు శిక్షణ, ఆన్లైన్ టీచింగ్, సిలబస్ తగ్గించి సకాలంలో పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం.
పరీక్షలు నిర్వహించే ముందే ఉపాధ్యాయులకు, లెక్చరర్లకు వాక్సిన్ వేయాలని భావిస్తున్నాం. ఇందుకోసం రాస్ట్రానికి ఇచ్చే కోటాను పెంచి వాక్సిన్ ఇవ్వాలి.రాష్ట్రంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు కేంద్రానికి తెలుసు. పరీక్షలు నిర్వహణకు మీరు ఇచ్చే ఆదేశాలు అనుసరించి నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం.