విధాత: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రతి కూరగాయ రూ. కేజీ 60పైనే ఉన్నది. టమాటా అయితే ఏకంగా పెట్రోల్‌ను మించి స్పీడ్‌గా దూసుకెళ్తొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సెంచరీ దాటేసింది. హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతుండగా.. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది. నవంబర్ నెల మొదట్లో ఏపీ, తెలంగాణ, […]
విధాత: దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ప్రతి కూరగాయ రూ. కేజీ 60పైనే ఉన్నది. టమాటా అయితే ఏకంగా పెట్రోల్‌ను మించి స్పీడ్‌గా దూసుకెళ్తొంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో సెంచరీ దాటేసింది. హైదరాబాద్‌లో కిలో టమాటా సుమారు రూ.120 పలుకుతుండగా.. టమాటా పంటకు అతి పెద్ద కేంద్రంగా ఉన్న ఏపీలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇక చెన్నైలో అయితే కిలో టమాటా ఏకంగా రూ.140 పలుకుతోంది.
నవంబర్ నెల మొదట్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో టమాటా ధర కిలో రూ.20 నుంచి రూ.40 మధ్యనే ఉండగా కేవలం 20 రోజుల గ్యాప్‌లోనే టమాట రేటు ఆకాశాన్నంటింది. దీనికి ప్రధాన కారణం ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా కురుస్తున్న వర్షాలేనని వ్యాపారులు అంటున్నారు.
దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ లో ఏటా లక్షా 43వేల ఎకరాల్లో 2.27 లక్షల టన్నుల టమాటా సాగవుతుంది. అం దులోనూ ఎక్కువ భాగం చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనే పండుతుంది. కాగా ఆ ప్రాంతాల్లోనే ప్రస్తుతం వర్షాలు భారీగా కురుస్తుండడంతో పంట డ్యామేజీ కావడం, ఉన్న పంట రవాణా చేయడానికి వీలు లేకుండా రోడ్లు, బ్రిడ్జిలు ధ్వంసం కావ డంతో టమాటా రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
మరో నెల రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని నెల తర్వాత గానీ టమాటా రేటు తగ్గడం కష్టమని వ్యాపారులు చెబు తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఉన్న మార్కెట్లకు మహారాష్ట్రలోని సోలాపూర్, కర్ణాటకలోని చిక్బల్లా పూర్ల నుంచి మాత్రమే వస్తున్నట్లు తెలుస్తోంది.