వైసీపీ నేతల ఆస్తులు రెండింతలు పెరిగాయి తప్ప వృద్ధుల ఫించన్ రూ. 250 కి మించి పెరగలేదు
వృద్ధులను మోసం చేయడానికి జగన్ కి మనసెలా ఒప్పింది. అనగాని సత్యప్రసాద్టీడీపీ శాసనసభ్యులు విధాత:ముఖ్యమంత్రి పదవి కోసం నాడు నోటికొచ్చినట్లుగా హామీలు గుప్పించిన జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసారు. ఫించన్ రూ. 3 వేలు చేస్తానని నాడు ఊరూరు తిరిగి చెప్పిన జగన్ కేవలం రూ.250 పెంచి వృద్ధులను, వితంతువులను వంచిoచారు. వృద్ధులను కొడుకులా ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రికి వారిని మోసం చేయడానికి మనసెలా వచ్చింది. వైసీపీ 2 […]

వృద్ధులను మోసం చేయడానికి జగన్ కి మనసెలా ఒప్పింది.
అనగాని సత్యప్రసాద్
టీడీపీ శాసనసభ్యులు
విధాత:ముఖ్యమంత్రి పదవి కోసం నాడు నోటికొచ్చినట్లుగా హామీలు గుప్పించిన జగన్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేసారు. ఫించన్ రూ. 3 వేలు చేస్తానని నాడు ఊరూరు తిరిగి చెప్పిన జగన్ కేవలం రూ.250 పెంచి వృద్ధులను, వితంతువులను వంచిoచారు. వృద్ధులను కొడుకులా ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రికి వారిని మోసం చేయడానికి మనసెలా వచ్చింది.
వైసీపీ 2 ఏళ్ల పాలనలో వైసీపీ నేతల ఆస్తులు రెండింతలు పెరిగాయి తప్ప వృద్ధుల పించన్ రూ.250 కి మించి పెరగలేదు. సంవత్సరానికి రూ.250 పెంచుతానని చెప్పి 2 ఏళ్లయినా ఎందుకు పెంచలేదు? వంచననకు మారు పేరు జగన్ రెడ్డి. ఇచ్చిన ప్రతి హామీ పూర్తిగా అమలు చేయకుండా మోసం చేసారు.45 ఏళ్లకే ఎస్సి, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఫించన్ ఇస్తానని చెప్పి ప్లేటు ఫిరాయించారు.అమ్మ ఒడి పధకం ద్వారా అమ్మ లందరికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక 80 లక్షల మంది అమ్మలకు రూ 15 వేలు ఇవ్వాల్సి ఉండగా 43 లక్షల మందికి తగ్గించి అమ్మలను మోసం చేసారు. జగన్ రెడ్డి 2 ఏళ్ల పాలనంతా అబద్దాలు, మోసాలు, వంచనలే. జగన్ రెడ్డి చేతిలో మోసపోయిన వారంతా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.