Vijayawada Dasara traffic | కనకదుర్గ దసరా ఉత్సవాలు: విజయవాడలో 10 రోజులపాటు దారి మళ్లింపులు
విజయవాడ దసరా ఉత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 2 వరకు ట్రాఫిక్ మళ్లింపులు అమల్లో ఉంటాయని నగర పోలీసులు తెలిపారు. భక్తులు ముందుగానే రూట్ మ్యాప్ చూసుకుని ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని సూచించారు.

Vijayawada Dasara 2025: Traffic Diversions Announced for 10 Days, Check Route Map
Vijayawada Dasara traffic | విజయవాడలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారు బాలా త్రిపుర సుందరి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండగా, పెద్ద ఎత్తున భక్తులు విజయవాడకు తరలివస్తున్నారు. ఈ భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలతో నగరంలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు.
ట్రాఫిక్ ఆంక్షలు – మారిన మార్గాలు
సెప్టెంబర్ 23 నుండి అక్టోబర్ 2 వరకు 10 రోజులపాటు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు అమలులోకి వస్తాయని విజయవాడ సీపీ రాజశేఖరబాబు తెలిపారు.
- హైదరాబాద్ – విశాఖపట్నం వైపు వెళ్ళే వాహనాలు : నల్లగుంట → వెస్ట్ బైపాస్ → చిన్న ఆవుటపల్లి → హనుమాన్ జంక్షన్ మార్గం ఉపయోగించాలి.
- హైదరాబాద్ – మచిలీపట్నం వైపు : నల్లగుంట → వెస్ట్ బైపాస్ → చిన్న ఆవుటపల్లి → కేసరపల్లి రూట్ తప్పనిసరి.
- హైదరాబాద్ – గుంటూరు/చెన్నై వైపు : నార్కట్‌పల్లి → నల్గొండ → మిర్యాలగూడ → నడికుడి → పిడుగురాళ్ల → అద్దంకి → మేదరమెట్ల మీదుగా ప్రయాణించాలి.
- చెన్నై – విశాఖపట్నం వైపు : ఒంగోలు → త్రోవగుంట → చీరాల → బాపట్ల → రేపల్లె → అవనిగడ్డ → గుడివాడ → హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్లాలి.
ఎన్.టి.ఆర్. జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయము, విజయవాడ.
దసరా ఉత్సవాల నేపథ్యంలో ట్రాఫిక్ మల్లింపులు (ర్యూట్ మ్యాప్ లు)#dasara #celebrations #trafficdiversion #trafficrules #parkingplaces #police #NTRDistrict #vijayawadacity @APPOLICE100 pic.twitter.com/jJ3sz7jWVv
— Vijayawada City Police (@VjaCityPolice) September 21, 2025
పార్కింగ్ సౌకర్యాలు
భవానీపురం వైపు నుండి వచ్చే వాహనాలు పున్నమిఘాట్, భవానీఘాట్, సెంట్రల్ వేర్ హౌస్, గొల్లపూడి మార్కెట్ యార్డ్, సోమా గ్రౌండ్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పార్క్ చేయాలి.
గుంటూరు, మచిలీపట్నం, గుడివాడ, అవనిగడ్డ వైపు నుండి వచ్చే వాహనాలు బీఆర్‌టీఎస్ రోడ్డు, సంగీత కళాశాల మైదానం, జింఖానా మైదానంలో పార్కింగ్ చేయవచ్చు.
కాగా, 11 రోజులపాటు కనకదుర్గ అమ్మవారు 11 రూపాలలో భక్తులకు దర్శనమిస్తారు. దసరా సెలవులు కూడా ఉండటంతో భక్తులు కుటుంబాలతో భారీ ఎత్తున విజయవాడ చేరుకుంటున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించడం, ప్రత్యేక పూజలు, హోమాలు, హారతులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు పండగ వాతావరణంలో మునిగిపోయాయి.