YS Sharmila | కడపలో కచ్చితంగా నాదే విజయం : వైఎస్‌ శర్మిల

YS Sharmila | కడప లోక్‌సభ స్థానంలో కచ్చితంగా తనదే విజయమని ఆంధప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ శర్మిల అన్నారు. కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

YS Sharmila | కడపలో కచ్చితంగా నాదే విజయం : వైఎస్‌ శర్మిల

YS Sharmila : కడప లోక్‌సభ స్థానంలో కచ్చితంగా తనదే విజయమని ఆంధప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్‌ అభ్యర్థి వైఎస్‌ శర్మిల అన్నారు. కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ బూత్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

కడపలో కచ్చితంగా తానే విజయం సాధిస్తానని ఆమె చెప్పారు. రాష్ట్రంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కేవలం 2 శాతం ఓట్లు వచ్చాయని ఇప్పుడది డబుల్‌ డిజిట్‌కు చేరుకుంటుందని అన్నారు. అదేవిధంగా ఏపీ అసెంబ్లీ స్థానాల్లో కూడా ఈసారి కాంగ్రెస్‌కు డబుల్ డిజిట్‌ వస్తుందని చెప్పారు.

కాగా, కడపలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వైఎస్‌ శర్మిల పోటీ పడుతుండగా, వైసీపీ నుంచి వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి బరిలో నిలిచారు. టీడీపీ నుంచి చడిపిరాళ్ల భూపేశ్‌ సుబ్బరామిరెడ్డిని బరిలో దించారు. ప్రస్తుతం వైసీపీ అభ్యర్థి అవినాశ్‌ రెడ్డి కడప సిట్టింగ్‌ ఎంపీగా ఉన్నారు.