వైస్సార్ తరువాత కడప అభివృద్ధి ని ఎవరు పట్టించుకోలేదు ..సీఎం జగన్

బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ది కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు బహిరంగసభలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌.ఈ సభలో మాట్లాడిన నేతలు ఏమన్నారంటే. స్‌.బి.అంజాద్‌బాష, డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ బద్వేలు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం.గతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే ఈ జిల్లా అభివృద్ది జరిగింది. మాటల ప్రభుత్వాలు చూశాం కానీ జగనన్న ప్రభుత్వం చేతల ప్రభుత్వం, ఆయన తన పాదయాత్రలో […]

వైస్సార్ తరువాత కడప అభివృద్ధి ని ఎవరు పట్టించుకోలేదు ..సీఎం జగన్

బద్వేలు నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ది కార్యక్రమాల శిలాఫలకాల ఆవిష్కరణతో పాటు బహిరంగసభలో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్‌.
ఈ సభలో మాట్లాడిన నేతలు ఏమన్నారంటే.

స్‌.బి.అంజాద్‌బాష, డిప్యూటీ సీఎం, మైనారిటీ సంక్షేమ శాఖ

బద్వేలు నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం శుభపరిణామం.గతంలో దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో మాత్రమే ఈ జిల్లా అభివృద్ది జరిగింది. మాటల ప్రభుత్వాలు చూశాం కానీ జగనన్న ప్రభుత్వం చేతల ప్రభుత్వం, ఆయన తన పాదయాత్రలో అందరి కష్టాలు తెలుసుకున్నారు, వారికి మాట ఇచ్చారు, ఇచ్చిన హమీలలో 95 శాతం హమీలు అమలుచేసిన ప్రభుత్వం. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం. ఇలాంటి ముఖ్యమంత్రి 30 ఏళ్ళు సీఎంగా ఉంటే పేదరికమనేది ఉండదని భావిస్తున్నా, ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న సీఎంగారిని అందరూ దీవించాలి, ఆశీర్వదించాలి.

ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి, వైఎస్సార్‌ కడప జిల్లా ఇంచార్జి మంత్రి

ఈ రెండేళ్ళలో బడుగు, బలహీనవర్గాలు, దళితుల అభివృద్దికి మన జగనన్న మొక్కవోని దీక్షతో ముందుకెళుతున్నారు. సమాజాభివృద్ది జరగాలంటే విద్యాభివృద్దితోనే సాధ్యమని చెప్పిన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ భావజాలాన్ని పుణికిపుచ్చుకుని వివిధ కార్యక్రమాలు అమలుచేస్తున్నారు. విద్యకు పేదరికం అడ్డురాకూడదని జగనన్న చేస్తున్న కార్యక్రమాలు తెలియనివి కావు. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమంతో అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారు, పిల్లలను మీరు బడికి పంపండి నేను మంచి చదువు చెప్పిస్తాను అని వారికి కావాల్సిన ప్రతీది అందజేస్తున్నారు. జగనన్న విద్యాకానుకలో ఈ ఏడాది కొత్తగా డిక్షనరీ ఇవ్వడంతో పాటు వచ్చే ఏడాది ప్రత్యేకంగా క్రీడలకు సంబంధించి యూనిఫామ్, షూస్‌ ఇవ్వనున్నారు. పిల్లలకు మేనమామగా వారి భవిష్యత్‌కు బంగారుబాట వేస్తున్నారు. పిల్లలు పెరిగేవరకూ మీరే సీఎంగా ఉండాలని అక్కచెల్లెమ్మలు కోరుకుంటున్నారు. అణగారిన వర్గాలకు, బడుగు, బలహీనవర్గాలకు ఉపయోగపడేలా ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టి వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారు, బడుగు వికాసం పేరుతో దళిత పారిశ్రామిక వేత్తలకు సాయం చేయనున్నారు. మంత్రి వర్గంలో నేను ఒక దళితుడిగా ఉండి విద్యాశాఖను నిర్వహిస్తున్నానంటే ఆయన గుండెల్లో మనకు ఏ స్ధానం ఉందో తెలుసుకోవచ్చు.

వైఎస్‌.అవినాష్‌ రెడ్డి, కడప ఎంపీ

బద్వేలు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం,ఇటువంటి నియోజకవర్గంలో బ్రహ్మంసాగర్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పూర్తిచేసి, క్రమం తప్పకుండా ప్రతీ ఏడాది 12, 13 టీఎంసీల నీళ్ళు ఉంచేవారు.దీంతో బద్వేలు నియోజకవర్గంలో అన్ని మండలాలలోని రైతులకు సాగు నీరందేది.ఆయన మరణం తర్వాత ఏ ప్రభుత్వమైనా కనీసం 4,5 టీఎంసీలు అయినా నిల్వచేసిందా అని అడుగుతున్నా. తీవ్రమైన దుర్భిక పరిస్ధితులు ఎదుర్కొన్నారు, కానీ జగనన్న ప్రభుత్వం రాగానే బ్రహ్మంసాగర్‌ను పూర్తిస్ధాయిలో నింపడమే కాక అన్ని మండలాలకు నీరందిస్తున్నారు, అంతేకాక సీఎంగారు ఏడాది క్రితమే కుందూ నుంచి బ్రహ్మంసాగర్‌కు రూ. 600 కోట్లతో ఎత్తిపోతల పథకానికి శంకుస్ధాపన చేశారు, ఆ పనులు కూడా ఏడాదిన్నరలో పూర్తయితే బ్రహ్మంసాగర్‌లో ప్రతీ ఏడాది కచ్చితంగా 14,15 టీఎంసీల నీరు నింపవచ్చు. వెలుగోడు నుంచి బ్రహ్మంసాగర్‌కు నీటి కోసం అనేకసార్లు గత ప్రభుత్వాలకు చెప్పాం కానీ జగనన్న వచ్చిన తర్వాత రూ. 300 కోట్లతో ఆ పనులు ప్రారంభించడం జరిగింది. బ్రహ్మంసాగర్‌ రిజర్వాయర్‌ను అన్ని రకాలుగా స్టెబిలైజ్‌ చేస్తున్నారు.ఏడు మండలాల్లోని రైతులకు ఎటువంటి కరువు పరిస్ధితులు వచ్చినా కూడా అండగా ఉండే కార్యక్రమం చేస్తున్నారు. అనేక ప్రాజెక్ట్‌లు శంకుస్ధాపనతో పాటు బద్వేలు మునిసిపాలిటీని సుందరమైన టౌన్‌గా మార్చబోతున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతీ ఎకరాకు సాగునీరందించే విధంగా కార్యాచరణ సిద్దం అయింది. తండ్రికి తగ్గ తనయుడిగా రాష్ట్ర సమగ్రాభివృద్దికి అహర్నిశలు కృషిచేస్తున్న మన జగనన్నకు ఆ భగవంతుని ఆశీస్సులు, మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.