కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌.బాబు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌.షర్మిల వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఫోకస్ చేశారు. తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు

కాంగ్రెస్‌లో చేరిన వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్‌.బాబు

విధాత : ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్‌.షర్మిల వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై ఫోకస్ చేశారు. తాజాగా పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్‌.బాబు వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బాబుతో పాటు ఇప్పటి వరకు కాంగ్రెస్‌లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు చేరినట్లయ్యింది. ఇటీవల నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాలు కాంగ్రెస్‌లో చేరగా వారిద్దరికి ఎమ్మెల్యే టికెట్లు కేటాయించింది. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా వారి ఓటింగ్‌ను తమ వైపు తిప్పుకోవడమే షర్మిల వ్యూహంగా కనిపిస్తుంది.