లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ

విధాత :లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేసేందుకు పార్టీ నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఒకే విధమైన లక్ష లేఖలు ముద్రించి.. వాటిపై ముందుగా అనుకున్న వారి మొబైల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు రాసి లేఖలు పంపేలా ప్రణాళికలు వేశారని లేఖలో పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో ఆ పథకాన్ని ఆపారని తెలిపారు. ఇలా తనపై అనేక కుట్రలు, ప్రణాళికలు […]

లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ

విధాత :లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ రాశారు. తనపై అనర్హత వేటు వేసేందుకు పార్టీ నేతలు అనేక కుట్రలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఒకే విధమైన లక్ష లేఖలు ముద్రించి.. వాటిపై ముందుగా అనుకున్న వారి మొబైల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు రాసి లేఖలు పంపేలా ప్రణాళికలు వేశారని లేఖలో పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కడంతో ఆ పథకాన్ని ఆపారని తెలిపారు. ఇలా తనపై అనేక కుట్రలు, ప్రణాళికలు ద్వారా ఎదో ఒకటి చేయాలని చూస్తున్నారని స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లారు. తనపై అనర్హత వేటు కోసం అనేక పక్కదారులు పడుతున్నారని.. వాటిని పట్టించుకోవద్దని స్పీకర్‌ను రఘురామరాజు కోరారు.