అమరావతి : వచ్చే ఏడాది చివరిలో నా పాదయాత్ర ఉంటుందని..ఒకటిన్నర సంవత్సరం పాటు పాదయాత్రలో పత్రి ఊరు తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతానని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ ప్రకటించారు. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్‌సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్‌తో జరిగిన భేటీలో జగన్ మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వంపై విరుచుకపడ్డారు.
దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్‌తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని, ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మ్యానిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయిందని జగన్ విమర్శించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయన్నారు. మా ప్రభుత్వంలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు అని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోందన్నారు.
మా పాలనలో చేసిన అప్పులో సింహభాగం జనం జేబుల్లోకే
వైసీపీ పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ పద్దతిలో ఒక్క బటన్ నొక్కడం ద్వారా రూ.2.73 లక్షల కోట్లు సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఇచ్చాం అని జగన్ తెలిపారు. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారని, చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్ జగన్ నిలదీశారు.
దోపిడీ గని అమరావతి
చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోందని మండిపడ్డారు. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోందని, కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే అమరావతి రాజధానిని తెరపైకి తెచ్చారని విమర్శించారు. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్‌లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు అని పునరుద్ఘాటించారు. అయితే చంద్రబాబు మావిగన్‌ను వద్దంటున్నారు అని, ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి అని జగన్ ఆరోపించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్‌స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
ఆర్థిక భారం తప్పించేందుకే మావిగన్ ప్రతిపాదన
అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం బెస్ట్ ఆప్షన్‌గా ప్లాన్ ఏ కింద రాజధానిగా విశాఖ పట్నంను సూచించామని, న్యాయ రాజధానిగా కర్నూల్‌ను చెప్పాం.. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం అని జగన్ గుర్తు చేశారు. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్‌ను మావిగన్(MAVIGUN)ను సూచించాం అన్నారు. చంద్రబాబు, ఆయన అనునయులకు కాంట్రాక్టులు, కమిషన్లు, మొబైలేజేషన్ అడ్వాన్స్ ల కోసం అమరావతి జపం చేస్తున్నారని విమర్శించారు. రాజధాని అంశంలో ప్రశ్నిస్తున్న వైసీపీ శ్రేణులపై అనుచిత విమర్శలు చేస్తున్న పత్రికాధిపతి రాధాకృష్ణకు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తగిన గుణపాఠం చెబుతామన్నారు. మహిళలను మోసం చేసిన నాయకులకు చంద్రబాబు అండగా నిలబడటం శోఛనీయమని జగన్ విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన ప్రజలు టీడీపీని ఫుట్ బాల్ మాదిరిగా తంతారని, సింగిల్ డిజిట్ కూడా రాకపోవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి :
సుంచింద్రం కోనేటిలో వెలుగు చూసిన కాంస్య విగ్రహం
అస్సాం,కేరళం,పుదుచ్చేరిలో రేపు పోలింగ్ !
