వైయస్‌ఆర్ పెన్షన్ కానుక పంపిణీకి సర్వం సిద్ధం
రాష్ట్ర వ్యాప్తంగా 60.95 లక్షల మందికి పెన్షన్లు రూ.1484.9 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా గడప వద్దనే పెన్షన్ల పంపిణీ మూడు రోజుల్లో నూరుశాతం పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు విధాత:రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు వారి ఇంటి గడప వద్దే పింఛన్లు అందించాలన్న సీఎం వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా […]

- రాష్ట్ర వ్యాప్తంగా 60.95 లక్షల మందికి పెన్షన్లు
- రూ.1484.9 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా గడప వద్దనే పెన్షన్ల పంపిణీ
- మూడు రోజుల్లో నూరుశాతం పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు
విధాత:రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు వారి ఇంటి గడప వద్దే పింఛన్లు అందించాలన్న సీఎం వైయస్ జగన్ సంకల్పంలో భాగంగా జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం 1484.96 కోట్లు విడుదల చేసిందని ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.66 లక్షల మంది వలంటీర్లు ఉదయం నుంచే ప్రతి లబ్ధిదారుడి ఇంటి వద్దకు వెళ్ళి పెన్షన్ సొమ్మును వారి చేతికే అందిస్తారని అన్నారు. మూడు రోజుల్లో మొత్తం పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియలో రాష్ట్ర వ్యాప్తంగా 15వేల మంది వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్లు, వార్డు వెల్ఫేర్ డెవలప్‌మెంట్ సెక్రటరీలు కూడా పాల్గొంటారని అన్నారు. పదమూడు జిల్లాల్లోని డిఆర్‌డిఎ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన జిల్లా కాల్ సెంటర్ల ద్వారా పంపిణీ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. పెన్షనర్లకు బయోమెట్రిక్ అథెన్టికేషన్, ఐఆర్‌ఐఎస్, ఆర్‌బిఐఎస్, ఫేషియల్ అథెన్టికేషన్, ఫ్యామిలీ మెంబర్స్ బయోమెట్రిక్ అథెన్టికేషన్ల లో వీలైన విధానం ద్వారా నిర్ధారించిన తరువాత పెన్షన్ సొమ్మును పంపిణీ చేస్తారని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 3,56,900 మంది ఎస్టీలకు వైయస్‌ఆర్ పెన్షన్ కానుక కింద రూ.84.80 కోట్లు, 9,95,025 లక్షల మంది ఎస్సీలకు రూ.242.62 కోట్లు, 29,84,192 మంది బిసిలకు రూ.723.38 కోట్లు, 4,01,498 మంది కాపు సామాజికవర్గం లబ్ధిదారులకు రూ.96.19 కోట్లు, 10,90,892 మందికి రూ.272.83 కోట్లు, 2,42,175 లక్షల మంది మైనార్టీలకు రూ.58.92 కోట్లు, 24,963 మంది బ్రాహ్మణ సామాజికవర్గం లబ్ధిదారులకు రూ.6.22 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్ల కింద 26,21,520 మందికి రూ.613.62 కోట్లు, చేనేత పెన్షన్ల కింద 1,06,797 మందికి రూ.24.74 కోట్లు, 6,51,961 మంది దివ్యాంగులకు రూ.203.26 కోట్లు, 21,56,354 మంది వితంతువులకు రూ.507.87 కోట్లు, 34,504 గీతకార్మికులకు రూ.7.96 కోట్లు, అభయహస్తం కింద 1,19,088 మందికి రూ.6.27 కోట్లు, 2156 మంది ట్రాన్స్‌జండర్లకు రూ.69 లక్షలు, 58,006 మంది మత్స్యకారులకు రూ.13.56 కోట్లు, 1,82,212 మంది వంటరి మహిళలకు రూ.42.65 కోట్లు, 31,932 మంది సంప్రదాయ చర్మకారులకు రూ.7.37 కోట్లు, 43,694 మంది రూ.13.30 కోట్లు, 4052 మంది కళాకారులకు రూ.1.26 కోట్లు, 652 మందికి సైనిక సంక్షేమ పెన్షన్ల కింద రూ.36 లక్షలు, ఏఆర్‌టి పెన్షన్ల కింద 21,905 మందికి రూ.4.93 కోట్లు, డిఎంహెచ్‌ఓ మెడికల్ పెన్షన్ల కింద 52,057 మందికి 27.56 కోట్లు, సికెడియు ప్రభుత్వ కేటగిరి కింద 3947 మందికి రూ.4.56 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రుల్లోని 4808 మందికి రూ.5.01 కోట్లు పంపిణీ చేస్తున్నామని వివరించారు.