వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయం
విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ […]

విధాత: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్ ఇన్‌కమ్‌బర్డ్ ఖాతాల్లో నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కాపుల్లో నిరుపేదల ఉన్న వారికి ‘వైఎస్‌ఆర్ కాపు నేస్తం’ అందిస్తున్నామని, కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల మహిళలకు ఆర్ధిక సాయం అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన కాపు మహిళలకు ఏటా రూ.15 వేలు ఆర్ధిక సాయం, ఐదేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా వెనక్కి తగ్గకుండా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు.
వరసగా రెండో ఏడాది కూడా ఈ పథకం అమలు
వరసగా రెండో ఏడాది కూడా ఈ పథకం అమలు చేస్తున్నామని, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ‘వైఎస్‌ఆర్ కాపు నేస్తం’కు శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది.. ఏం చేసిందో అందరూ ఆలోచించుకోవాలని గుర్తు చేశారు. ఏటా రూ.1,500 కోట్లు ఇస్తామని కనీసం ఏడాదికి రూ.400 కోట్లు కూడా ఇవ్వలేదని తెలిపారు. రెండేళ్లలో ‘వైఎస్‌ఆర్ కాపు నేస్తం’ కింద రూ.12,126 కోట్లు అందించామని అన్నారు. 3,27,244 మంది లబ్దిదారులకు నేరుగా నగదు జమ చేస్తున్నామని తెలిపారు. అర్హత ఉన్న కాపు మహిళలు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సీఎం జగన్ చెప్పారు.