కాళే­శ్వ‌రం ఖర్చులో నాలుగో వంతుతో 16 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు

కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో నాలుగోవంతుతో ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం పూర్తయి ఉండేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

కాళే­శ్వ‌రం ఖర్చులో నాలుగో వంతుతో 16 లక్షల ఎకరాలకు కొత్త ఆయకట్టు
  • కానీ.. ప్రాణ­హి­త­చే­వె­ళ్లను మార్చే­సిన మాజీ సీఎం కేసీ­ఆర్‌
  • గత సర్కార్‌ తప్పు­లకు అనేక తరాలు బాధ­ప­డాల్సి వస్తుంది
  • ఈ ఏడాది డిసెం­బర్‌ నాటికి 5 లక్షల ఎక­రాల కొత్త ఆయ­కట్టు
  • పాల­మూరు రంగా­రెడ్డి నిధుల కోసం ప్రతి­పా­ద­నలు
  • సమీక్షా సమావేశంలో ఇరిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి

విధాత‌: కాళే­శ్వరం ప్రాజె­క్టుకు పెట్టిన ఖర్చులో నాలు­గో­వం­తు­తోనే ప్రాణ­హి­త­చే­వెళ్ల ఎత్తి­పో­తల పూర్తయి, కొత్తగా 16 లక్షల ఎక­రాల ఆయ­క­ట్టుకు సాగు­నీరు అంది ఉండే­దని రాష్ట్ర నీటి­పా­రు­దల శాఖ మంత్రి ఎన్‌ ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రెడ్డి చెప్పారు. కానీ.. అంబే­ద్కర్‌ ప్రాణ­హి­త­చే­వెళ్ల ప్రాజె­క్టును మాజీ ముఖ్య­మంత్రి కేసీ­ఆర్‌ కాళే­శ్వరం ప్రాజె­క్టుగా మార్చా­రని విమ­ర్శిం­చారు. 2024 డిసెం­బ‌ర్ నాటికి 5 ల‌క్ష‌ల ఎక‌­రాల కొత్త ఆయ‌­క‌­ట్టుకు సాగు­నీరు అందిం­చా­ల‌ని అధి­కా­రు­లను మంత్రి ఆదే­శిం­చారు. శ‌ని­వారం జ‌ల‌­సౌ­ధ‌లో సాగు­నీటి ప్రాజె­క్టుల పురో­గ‌­తిపై ఆయన సమీక్ష నిర్వ­హిం­చారు. కొత్త ఆయ‌­క‌­ట్టుకు సాగు­నీరు అందించే విష‌­యంలో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసు­కో­వా­ల‌ని స్ప‌ష్టం చేశారు. కొత్త ప్రాజె­క్టు­లను పూర్తి చేసే విష‌­యంలో ఉన్న‌­అ­డ్డం­కు­లన్నీ అధి­గ­మించి సకా­లంలో నీరం­దిం­చా­ల­న్నారు. సాగు­నీటి ప్రాజె­క్టుల విష­యంలో కేసీ­ఆర్ ప్రభుత్వం చేసిన తప్పి­దా­లతో తెలం­గాణ ప్రజలు తర­త­రా­లుగా దుష్ప­రి­ణా­మా­లను చవి­చూ­డాల్సి వస్తుం­దని ఆవే­దన వ్యక్తం చేశారు. గత పాల­కులు కాళే­శ్వరం ప్రాజెక్టు విష­యంలో చేసిన తప్పి­దా­లపై ఇప్ప­టికే విజి­లెన్స్ విచా­రణ ప్రారం­భ­మైం­దని తెలి­పారు. కాళే­శ్వరం మొత్తం ప్రాజె­క్టు­పైన విచా­రణ కోసం హైకోర్టు చీఫ్ జడ్జికి లేఖ రాశా­మని చెప్పారు. కాళే­శ్వ‌రం అవి­నీ­తిపై సిట్టింగ్ జడ్జి విచా­రణ కోరు­తు­న్నా­మ‌ని తెలి­పారు.


పాల‌­మూరు రంగా­రెడ్డి నిధుల కోసం ఈ వారంలో ప్ర‌తి­పా­ద‌­న‌లు

తెలం­గాణ నీటి హక్కు­లను కాపా­డేం­దుకు రాష్ట్ర ప్రభుత్వ నిబ­ద్ధ­తతో ఉందని మంత్రి ఉత్త­మ్‌­కు­మా­ర్‌­రెడ్డి అన్నారు. పాల­మూరు రంగా­రెడ్డి లిఫ్ట్‌ ఇరి­గే­షన్‌ పథ­కా­నికి జాతీయ ప్రాజెక్టు హోదా కల్పిం­చా­లని కోరుతూ ఇటీ­వల ముఖ్య­మం­త్రితో కలిసి వెళ్లి కేంద్ర జల వన­రుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకా­వ­త్‌కు విజ్ఞప్తి చేశా­మని తెలి­పారు. జాతీయ ప్రాజెక్టు హోదా కోసం నిర్దిష్ట పథకం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేసినా, నిధులు మంజూరు చేస్తా­మని హామీ ఇచ్చా­రని వివ­రిం­చారు. వివిధ కేంద్ర ప్రభుత్వ పథ­కాల కింద పాల­మూరు రంగా­రె­డ్డికి నిధులు ఇస్తా­మ‌న్న‌ కేంద్ర మంత్రి హామీ మేరకు కేంద్ర ప్రభు­త్వా­నికి ప్రతి­పా­దన పంపు­తా­మని తెలి­పారు. నీటి­పా­రు­దల శాఖలో బీఆ­రెస్ పాల‌­కులు అప్పులు ఎక్కువ చేశా­రని, అందుకు తగిన ఫలితం మాత్రం రాలే­ద­న్నారు. బీఆ­రె­ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద­ఎ­త్తున జ‌రి­గిన‌ నిధుల వృథా, అను­త్పా­దక వ్యయా­న్ని­బ­హి­ర్గతం చేశా­మ‌­న్నారు. తమ ప్రభుత్వం కొత్త ఆయ­క­ట్టును పెంచ­డంపై దృష్టి సారిం­చిం­ద‌­న్నారు. చిన్న కాళే­శ్వరం ప్రాజెక్టు ద్వారా మంథని నియో­జ­క­వ­ర్గా­నికి నీరం­దించే పనులు చేప­ట్టా­లని మంత్రి ఉత్త‌మ్ అధి­కా­రు­ల‌కు సూచిం­చారు.


కొత్త ఆయ­కట్టు సమ­స్యల పరి­ష్కా­రా­నికి యుద్ధ ప్రాతి­ప­ది­కన చర్యలు

రాబోయే జూన్ నాటికి కొత్త ఆయ­కట్టు ఇచ్చే ప్రాజె­క్టులు, ఏడాది చివర నాటికి కొత్త ఆయ­కట్టు ఇచ్చే ప్రాజె­క్టుల పను­లను వేగ­వంతం చేయా­లని మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి అధి­కా­రు­ల‌కు స్ప‌ష్టం చేశారు. కొత్త ఆయ­క­ట్టుకు సంబం­ధిం­చిన సమ­స్యల పరి­ష్కా­రా­నికి యుద్ధ ప్రాతి­ప­ది­కన చర్యలు చేప­ట్టా­లని చెప్పారు. రాబోయే ఐదే­ళ్లలో ఏ ప్రాజె­క్టు­లలో కొత్త ఆయ­కట్టు ఎంత ఇస్తు­న్నామో సమా­చారం సిద్ధం చేయా­లని సూచిం­చారు. అలాగే కొత్త ఆయ­క­ట్టుకు నీరిచ్చే విష­యంలో ప్రత్యేక చర్యలు తీసు­కో­వా­ల­న్నారు. కృష్ణా, గోదా­వరి బేసి­న్లలో సుమారు 18 ప్రాజె­క్టు­లలో పలు ప్యాకే­జీల కింద ఈ ఏడాది చివ­రి­నా­టికి నీరం­ది­స్తా­మ‌ని అధి­కా­రులు మంత్రికి వివ‌­రిం­చారు.


వేస‌­విలో చెరు­వుల పూడిక

రాబోయే వేస­వి­కా­లంలో రాష్ట్రంలో చెరు­వుల పూడిక కార్య­క్ర­మాలు, జంగిల్ కటింగ్ చేప­ట్టా­లని మంత్రి అధి­కా­రు­ల‌ను ఆదే­శిం­చారు. దీనికి సంబం­ధిం­చిన ప్రిప‌­రే­ష‌న్ ఇప్ప‌టి నుంచే జ‌ర‌­గా­ల‌­న్నారు. రైతుల పంట‌­లకు చెరు­వుల నీరు పెట్ట‌డం ఆగి­పో­వ‌­డం­తోనే ప‌నులు మొద‌లు కావా­ల‌­న్నారు. ఈ మేర‌కు యుద్ధ‌ ప్రాతి­ప­ది­కన పనులు చేపట్టి, వర్షా­కా­లం­లోపు పూర్తి చేయా­ల‌­న్నారు. ఐడీసీ పరిధి ఉన్న అన్ని చిన్న ఎత్తి­పో­తల పథ­కాలు పూర్తి­స్థా­యిలో పని చేసేలా చర్యలు చేప­ట్టా­ల­న్నారు.


కోయినా నుంచి వంద‌ టీఎం­సీల నీరు ఇవ్వండి

ముఖ్య­మంత్రి ఆలో­చన మేరకు వేస‌­విలో తాగు­నీటి అవ‌­స‌­రాల కోసం కోయినా ప్రాజెక్టు నుంచి వంద‌ టీఎంసీ నీరు ఇవ్వా­లని మ‌హా­రాష్ట్ర ప్ర‌భు­త్వాన్ని కోరు­తు­న్నట్టు ఉత్త‌మ్ కుమా­ర్‌­రెడ్డి తెలి­పారు. అలాగే కర్ణా­టక నుంచి కూడా 10 టీఎం­సీల నీటిని కోరు­తు­న్నా­మ‌­న్నారు. ఈ మేర‌కు త్వ‌ర‌లో ముఖ్య­మంత్రి రేవంత్ రెడ్డి నేతృ­త్వం­లోని ప్రతి­నిధి బృందం కర్ణా­ట­కలో పర్య­టిం­చ­నుం­దని ఆయన వివ­రిం­చారు. నీటికి బ‌దు­లుగా మహా­రా­ష్ట్రకు ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే విద్యుత్తు ఉత్ప­త్తికి సంబం­ధిం­చిన వ్యయం అంది­స్తా­మని ప్రతి­పా­దిం­చా­మని తెలి­పారు. ఈ సమా­వే­శంలో నీటి పారు­ద­ల­శాఖ ముఖ్య కార్య­దర్శి రాహుల్ బొజ్జ, నీటి పారు­దల శాఖ ఈఎన్సీ ముర­ళీ­ధ­ర్‌­రా­వు­తో­పాటు ప‌లు­వురు చీఫ్ ఇంజి­నీర్లు, ఇత‌ర ఉన్న­తా­ధి­కా­రులు పాల్గొ­న్నారు.