RBI Ombudsman Scheme | ఇదేందయ్య ఇదీ..! ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ స్కీమ్‌లో ఏడాదిలో 7.3లక్షల ఫిర్యాదులు..!

RBI Ombudsman Scheme | ప్రస్తుత కాలంలో బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్స్ భారీగా పెరిగాయి. బ్యాకింగ్ వ్యవస్థల్లో ప్రతిరోజూ కోట్లాది ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి. అయితే, బ్యాంకింగ్ సేవల్లో ఏవైనా సమస్యలు ఎదురైన సమయంలో కస్టమర్లు బ్యాంకు సిబ్బందికి ఫిర్యాదు చేస్తుంటాయి. సిబ్బంది వాటిని పరిశీలించి పరిష్కరిస్తుంటారు. అయితే, బ్యాంకులు కస్టమర్ల ఫిర్యాదులు పట్టించుకోని సందర్భాలు లేకపోలేదు. ఇందు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంబుడ్స్‌మన్ స్కీమ్‌ను తీసుకువచ్చింది. ఏదైనా సమస్య ఎదురై.. బ్యాంకు సిబ్బంది స్పందించని సమయంలో అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఈ అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద ఫిర్యాదులు భారీగా నమోదవుతున్నాయి. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2లక్షల ఫిర్యాదులు నమోదైనట్లు రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన గణాంకాలు పేర్కొంటున్నాయి. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అంబుడ్స్‌మన్ స్కీమ్ కింద 7.03 ఫిర్యాదులు రికార్డయ్యాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఫిర్యాదులు ఏకంగా 68శాతం అధికంగా నమోదయ్యాయి. ఇందులో మొబైల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్, లోన్స్, ఏటీఎం, డెబిట్, క్రెడిట్ కార్డులు, పెన్షన్ చెల్లింపులు, రెమిటెన్స్, పారా బ్యాంకింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే, ఇందులో అత్యధికంగా కేవలం మొబైల్, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్‌కు సంబంధించినవే ఉండడం ప్రస్తావనార్హం. ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ 2021 కింద ఆర్‌బీఐ చెందిన 22 అంబుడ్స్‌మన్ ఆఫీసులు, సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్, కాంటాక్ట్ సెంటర్లకు వచ్చిన ఫిర్యాదులతో మొదటి స్టాండ్-7 lakh Complaints under RBI ombudsman schemes in 2022-23 yearఅలోన్ 2022-23 నివేదిక ప్రకారం.. ఆర్థిక సంవత్సరంలో 7,03,544 ఫిర్యాదులు వచ్చాయి. అయితే, వివిధ చైతన్య కార్యక్రమాల ద్వారా ఫిర్యాదులు 68.24శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.
ఓఆర్‌బీఐఓలు (ORBIOs) స్వీకరించిన ఫిర్యాదులలో 83.78 శాతం బ్యాంకులకు వ్యతిరేకంగా ఫిర్యాదులు అత్యధికంగా (1,96,635 ఫిర్యాదులు) వచ్చాయి. 2,34,690 ఫిర్యాదులను ఆర్‌ఓఐబీఓలు, సీఆర్‌పీసీ కేంద్రాలు 4,68,854 ఫిర్యాదులను పరిష్కరించాయి. ఓఆర్‌బీఐఓల్లో సగటున 33 రోజుల్లో ఫిర్యాదులకు పరిష్కారం దొరికింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 2021-22 ఇది 44 రోజులుగా ఉన్నది. ఆర్‌బీఐఓస్ కింద పరిష్కరించిన కంప్లయింట్లలో మెజారిటీ 57.48 శాతం భాగం మ్యూచువల్ సెటిల్‌మెంట్, మధ్యవర్తిత్వం ద్వారా జరిగింది. చండీగఢ్, ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్, గుజరాత్ నుంచి అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయని నివేదిక పేర్కొంది. మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ నుంచి తక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.