చిరంజీవిని టార్చర్ పెట్టిన నటుడు… యాక్టింగే మానేద్దామనుకున్న చిరు

మెగాస్టార్ చిరంజీవి స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన ఇప్పటికీ కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ వైవిధ్యమైన సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. చివరిగా భోళా శంకర్ అనే చిత్రం చేయగా,ఈ మూవీ ప్రేక్షకులని అంతగా అలరించలేకపోయింది. ఇప్పుడు విశ్వంభర అనే సినిమాతో మాత్రం మంచి వినోదాన్ని పంచే ప్రయత్నం చేస్తున్నాడు. రీఎంట్రీ తర్వాత కూడా చిరు క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం విశేషం. సీనియర్ హీరోలకు ఎవరికి సాధ్యం కానీ విధంగా వాల్తేరు వీరయ్య సినిమా తో 250 కోట్ల కలెక్షన్లు రాబట్టి అందరిని ఆశ్చర్యపరిచాడు మెగాస్టార్. అయితే చిరంజీవికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
ఓ నటుడు చిరంజీవిని తెగ టార్చర్ పెట్టడంతో యాక్టింగ్ మానేయాలని అనుకున్నాడట. వివరాలలోకి వెళితే చిరంజీవి నటించిన రౌడీ అల్లుడు సినిమాలో చిరంజీవి,ఐరెన్ లెగ్ శాస్త్రి కాంబోలో కొన్ని కీలక సన్నివేశాలు ఉన్నాయి. అయితే చిరంజీవి టెంపోని ఐరెన్ లెగ్ సరిగ్గా మ్యాచ్ చేయలేకపోవడం వలన చాలా సేపు ఆ సీన్స్‌ని చిత్రీకరించాల్సి వచ్చిందట. ఒకానొక టైంలో చిరుకి చిరాకు వచ్చి నాకు యాక్టింగ్ వద్దు అని చెప్పి పారిపోవాలన్నంత చిరాకు కలిగిందట. .నిజానికి దాంట్లో ఐరెన్ లెగ్ శాస్త్రి తప్పు కూడా ఏం లేదు.చిరంజీవి లాంటి స్టార్ నటుడితో నటించేటప్పుడు తను కొంచెం కంగారు పడిపోయి డైలాగులు మర్చిపోవడం, ఎక్స్ప్రెషన్ మిస్ చేయడం వంటివి చేశాడు.
చిరంజీవిని టార్చర్ పెట్టిన నటుడు… యాక్టింగే మానేద్దామనుకున్న చిరుఅయితే కొన్ని సన్నివేశాలలో చిరంజీవి అద్భుతంగా నటించగా, ఐరెన్ లెగ్ సరిగా చేయకపోవడంతో మెగాస్టార్ చాలా భాద పడాల్సి వచ్చిందని అప్పట్లో సినిమా యూనిట్ చాలా క్లారిటీగా తెలిపారు. ఇప్పుడు ఈ వార్త గురించి నెట్టింట చర్చ నడుస్తుంది. ఇక చిరు ప్రస్తుతం యూఎస్ లో ఉన్నారు. చిరు క్లోజ్ ఫ్రెండ్ ఎన్అర్ఐ అయిన కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు, శైల్య శ్రీల వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, సురేఖ దంపతులతో పాటు విక్టరీ వెంకటేశ్ ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలని చిరు తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నూతన దంపతులకి బెస్ట్ విషెస్ అందించారు.ఇక రెండు రోజుల తర్వాత చిరు హైదరాబాద్‌కి తిరిగి రానున్నారు. ఆ తర్వాత విశ్వంభర షూటింగ్లో పాల్గొననున్నారు.