ఏంటి.. బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కి చిరంజీవి రారా.. కార‌ణం ఏంటంటే..!

ఏంటి.. బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కి చిరంజీవి రారా.. కార‌ణం ఏంటంటే..!

నంద‌మూరి బాలయ్య రూటే స‌ప‌రేటు. ఆయ‌న ఏం చేసిన అది సెన్సేష‌న్ క్రియేట్ చేయాల్సిందే. ఇప్పటికే సినిమాల‌తో రికార్డులు సృష్టించిన బాల‌య్య అన్‌స్టాప‌బుల్ అనే షోకి హోస్ట్‌గా వ్య‌వ‌హరిస్తూ టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో అనేక వండ‌ర్స్ సృష్టించాడు. బాల‌య్య హోస్ట్‌గా రూపొందిన అన్‌స్టాప‌బుల్ అనే షో ఇప్ప‌టికే రెండు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. ఈ సీజ‌న్స్‌లో సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కులు కూడా హాజ‌రై సంద‌డి చేశారు. బాల‌య్య హోస్టింగ్ అంటే ముందుగా అంద‌రు భ‌య‌ప‌డ్డారు. కాని త‌ర్వాత సినీ స్టార్స్‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల‌కి వెరైటీ ప్ర‌శ్న‌లు సంధిస్తూ ప్రేక్ష‌కులని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేశాడు. ఎంతో మంది టాప్ స్టార్ సెలబ్రెటీస్ తో బాలయ్య బాబు చేసిన సరదా చిట్ చాట్ మంచి మ‌జా అందించింది.

ఇక మూడో సీజ‌న్ ఎప్పుడెప్పుడు మొద‌ల‌వుతుందా అని ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూశారు. ఈ క్ర‌మంలోనే ఆహా రీసెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పింది. అయితే మొదటి నుండి షోకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు అంటూ జోరుగా ప్ర‌చారం సాగింది. కాని ఇప్పుడు ఆయ‌న రావ‌డం లేద‌ని టాక్ న‌డుస్తుంది. మూడో సీజన్ కోసం అల్లు అరవింద్ నిజంగానే చిరంజీవిని సంప్రదించారట.అయితే డేట్స్ చూసి ఫిక్స్ చేస్తాను అని చెప్పిన చిరు.. త‌ర్వాత మాత్రం ఈ షోలో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే టాక్ వినిపిస్తుంది. బాల‌య్య షోకి తాను హాజ‌రు కాన‌ని ఖ‌రాఖండీగా చెప్పార‌ట‌. ఇటీవ‌ చిరు, బాలయ్యల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రాగా, అవి దృష్టిలో పెట్టుకొని చిరు రాన‌ని అన్నార‌ట‌.

రీసెంట్‌గా చిరు ఇంట్లో జరిగిన దీవాళి పార్టీకి సీనియ‌ర్ హీరోలు అయిన వెంక‌టేష్‌, నాగార్జున‌ల‌ని ఇన్వైట్ చేశారు చిరు. వారితో క‌లిసి ఫొటో కూడా దిగారు. అయితే ఈ పార్టీలో బాల‌య్య మిస్ కావ‌డం కాస్త వెలితిగా అనిపించింద‌ని కొంద‌రు కామెంట్స్ చేశారు. అయితే మెగా ఫ్యామిలీ నుండి రామ్ చ‌ర‌ణ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అన్‌స్టాప‌బుల్ షోకి వ‌చ్చి సంద‌డి చేయ‌గా, చిరు మాత్రం రాన‌ని చెప్ప‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతుంది. మరి బాల‌య్య‌, చిరంజీవిల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్ధలు తొలగిపోయి, ఈ ఇద్ద‌రు హీరోలు కలిసి ప్రేక్ష‌కుల‌ని ఎంట‌ర్‌టైన్ చేయాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.