జ‌వాన్ పాట‌కు మెగాస్టార్ సూప‌ర్భ్ డ్యాన్స్.. చ‌ర‌ణ్ దగ్గ‌రుండి మ‌రి..!

జ‌వాన్ పాట‌కు మెగాస్టార్ సూప‌ర్భ్ డ్యాన్స్.. చ‌ర‌ణ్ దగ్గ‌రుండి మ‌రి..!

దేశ‌మంత‌టా దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ అట్ట‌హాసంగా జ‌రుపుకోవ‌డం మ‌నం చూశాం. చిన్న పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల వ‌రకు ప‌టాకులు పేల్చి పండ‌గ‌ని ఘ‌నంగా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఇక సెల‌బ్రిటీలు అయితే తమ ఫ్యామిలీ, స‌న్నిహితుల‌తో కలిసి పార్టీ చేసుకున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి త‌న మ‌న‌వ‌రాలు పుట్టిన త‌ర్వాత వ‌చ్చిన తొలి దీపావ‌ళి సంద‌ర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో మెగా, అల్లు కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున, వెంకటేశ్‌, మహేశ్‌ బాబు, ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠీ, మంచు లక్ష్మీ తదితరులు సతీసమేతంగా పాల్గొని తెగ సంద‌డి చేశారు.

పార్టీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ నటించిన జవాన్ టైటిల్‌ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట ర‌చ్చ చేస్తుంది. ప్రముఖ సింగర్‌ రాజకుమారి ‘జవాన్’ పాటను ఆలపిస్తుండగా చిరంజీవి తనదైన గ్రేస్‌తో డ్యాన్స్ చేసి ఆహుతుల‌ని అల‌రించాడు. రామ్ చ‌ర‌ణ్ ద‌గ్గ‌రుండి త‌న తండ్రిని ఎంక‌రేజ్ చేస్తుండ‌డం వీడియోలో మ‌నకు క‌నిపిస్తుంది. అయితే ఈ వ‌య‌స్సులో కూడా చిరంజీవి అంత గ్రేస్‌తో డ్యాన్స్ చేస్తుండ‌డం చూసి ప్ర‌తి ఒక్క‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ‘బాసూ.. అదిరింది మీ గ్రేసు..’ అంటూ చిరు వీడియోకి నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టిన చిరంజీవి ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన భోళా శంక‌ర్ చిత్రంతో ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు బింబిసార ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి విశ్వంభర అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అలాగే ముగ్గురు హీరోయిన్లు ఇందులో న‌టించ‌నున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మూవీతో చిరు మంచి హిట్ కొడ‌తాడ‌ని అభిమానులు భావిస్తున్నారు.