డిసెంబర్ మూడున వెలువడే ఫలితాల్లో బీఆరెస్‌కు చేదు వార్త తప్పదని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.
విధాత: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించేందుకు స్పష్టమైన అవకాశాలు ఉన్నాయని ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే తేల్చి చెప్పింది. చెప్పినట్టుగానే కాంగ్రెస్ సునామీ కనిపించబోతున్నదని పేర్కొన్నది. పోలింగ్ ముగిసిన గురువారం సాయంత్రం ఈ సర్వే ఇవ్వాల్సి ఉన్నా.. వాయిదాపడి.. శుక్రవారం రాత్రి ప్రత్యక్ష ప్రసారంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న అంచనాలను వెల్లడించింది. దీని ప్రకారం కాంగ్రెస్ 63 నుంచి 73 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.
బీఆరెస్ 33-34 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. బీజేపీకి సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమవుతుందని, ఆ పార్టీకి నాలుగు నుంచి ఎనిమిది స్థానాల్లో విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. ఇతరులు కనీసం ఐదు, గరిష్ఠంగా 8 స్థానాలు గెలుస్తారని తెలిపింది. ఓటు షేరింగ్ విషయంలో బీఆరెస్‌కు 36శాతం, కాంగ్రెస్‌కు 42 శాతం, బీజేపీకి 14 శాతం, ఇతరులకు 8 శాతం ఓట్లు వస్తాయని లెక్కగట్టింది.