ఏంటి.. జాతిరత్నాలు బ్యూటీ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతుందా.. వరుడు ఎవరో తెలుసా?

టాలీవుడ్‌లో ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తుంది. అందాల ముద్దుగుమ్మలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తాము ప్రేమించిన వ్యక్తితో కొందరు ఏడడుగులు వేస్తుండగా, మరి కొందరు ఇంట్లో చూసినవారిని మనువాడుతున్నారు. ఇటీవల రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడగా, ఆ తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఇక రెండు రోజుల క్రితం హీరోయిన్ రహస్య యంగ్ హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం చేసుకుంది. త్వరలోనే వారి వివాహం జరగనున్నట్టు సమాచారం. ఇక రెజీనా కూడా పెళ్లాడబోతుందని ఓ టాక్ నడుస్తుంది. అయితే ఇప్పుడు జాతిరత్నాలు బ్యూటీ పెళ్లికి సంబంధించి కూడా ఓ వార్త వైరల్‌గా మారింది.
జాతిరత్నాలు సినిమాతో ఆమెకు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. ఈ అమ్మడు జాతిరత్నాలు సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు అందుకుంది. తన పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ భామ సోషల్ మీడియా ద్వారా తన పాపులారిటీ మరింత పెంచుకుంది. ఫరియా నటించిన జాతి రత్నాలు సినిమా మంచి హిట్ అయిన కూడా ఈ అమ్మడికి ఎందుకో పెద్దగ అవకాశాలు రావడం లేదు. ఆమె తన కెరీర్ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
ఆరడుగులుండే ఫరియా డాన్స్ కు యూత్ లో మాములు క్రేజ్ లేదు. బెల్లీ డ్యాన్స్‌తో కుర్రాళ్లకి పూనకం తెప్పిస్తుంటుంది. అయితే తాజాగా ఫరియా అబ్ధుల్లాకి సంబంధించిన ఓ వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది. ఆమె తన స్నేహితుడితో ఏడడుగలు వేసేందుకు సిద్ధమైందని టాక్. చిన్ననాటి నుంచి తనకు తెలిసిన తన సొంత ఫ్రెండ్ ని ఫరియా వివాహ మాడబోతుందని ఇండస్ట్రీలో ఓ టాక్ నడుస్తుంది. వారి వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఈ ఏడాదే వారి పెళ్లి జరగనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా రానుందని అంటున్నారు. మరి ఈ లోపే ఫరియా ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.