రామ్ చ‌రణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జ‌ర‌గండి.. సాంగ్ విడుద‌ల‌.. పాట అదిరిపోయింది బాసు..!

రామ్ చ‌రణ్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా జ‌ర‌గండి.. సాంగ్ విడుద‌ల‌.. పాట అదిరిపోయింది బాసు..!

తెలుగు పరిశ్రమలో శిఖరం. కోట్లాది మంది అభిమానులు, లెక్కలేనన్ని విజయాలు, తెలుగు సినీ పరిశ్రమని మూడు దశాబ్దాలు ఏలిన హీరో మెగాస్టార్ చిరంజీవి. ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ చిరుత సినిమాతో ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆర్ఆర్ఆర్ గ్లోబ‌ల్ స్టార్‌గా మారాడు. ఇప్పుడు శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ ఛేంజ‌ర్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ వ‌చ్చి చాలా రోజులే అయింది. ఈ రోజు రామ్ చ‌ర‌ణ్ సంద‌ర్భంగా క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. మూవీ నుండి జరగండి.. జరగండి అంటూ సాగే సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ చూడటానికి ఎంతో కలర్ ఫుల్‌గా కనిపించ‌డ‌మే కాదు, ఇందులో రామ్ చరణ్ లుక్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. సాంగ్‌ తగ్గ లొకేషన్ అయితే ఓ రేంజ్ లో ఉన్నాయి.ఇక ఈ పాట‌కి కియారా, రామ్ చ‌ర‌ణ్ త‌మ డ్యాన్స‌తో అద‌ర‌గొడ‌తార‌ని అనిపిస్తుంది.

దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరైన శంకర్ .. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చేస్తున్న విషయం తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతుండ‌గా, ఇందులో రామ్ చరణ్ రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడు. చిత్రంలో నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడని , మరో పాత్రలో ఐఏఎస్ ఆఫీసర్ గా క‌నిపించ‌నున్నాడ‌ని టాక్ వినిపిస్తుంది. శంకర్ ఈ సినిమాని చాలా రిచ్‌గా తెర‌కెక్కిస్తున్నారు. మే వ‌ర‌కు షూటింగ్ పూర్తి కానుంద‌ని, సెప్టెంబ‌ర్‌లో మూవీ రిలీజ్ కానుంద‌ని అంటున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కి జంటగా కియారా అద్వానీ నటిస్తుంది. వీరి కాంబోలో ఇది రెండవ చిత్రం.

ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా సునీల్, శ్రీకాంత్, అంజలి కీలక రోల్స్ చేస్తున్నారు. మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే ఈ రోజు రామ్ చ‌ర‌ణ్ బ‌ర్త్ డే కావ‌డంతో నిన్న రాత్రి రోడ్డు మార్గంలో తిరుమల చేరుకున్నారు చరణ్ దంపతులు. ఈ రోజు తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు రామ్ చరణ్ ఉపాసన దంపతులు. టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయగా రంగనాయకుల మండపంలో రాంచరణ్ దంపతులకు వేద పండితుల ఆశీర్వచనం అందించారు. క్లింకార తొలిసారి తిరుమ‌ల‌కి వెళ్ల‌గా చిన్నారిని చూసేందుకు కూడా అభిమానులు ఆస‌క్తి చూపారు.