కేవలం దివ్య భారతి కోసమే సినిమా తీసి నిర్మాతని రోడ్డు పాలు చేసిన హీరో ఎవరంటే..!

దివ్య భారతి.. ఒకప్పుడు తన అందచందాలతో అశేష ప్రేక్షకాదరణ పొందిన నటి. అందానికి అందం, అద్భుతమైన నటన ఆమె సొంతం. తెలుగులో కూడా చాలా మంది స్టార్ హీరోలతో కలిసి నటించింది. మోహన్ బాబుతో కలిసి దివ్యభారతి రెండు సినిమాలు చేసింది. అందులో అసెంబ్లీ రౌడీ మొదటిది కాగా,ఈ సినిమా కథ మాతృక చంద్రముఖి సినిమాల దర్శకుడు అయిన పి వాసు అందించారు. మాస్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసెంబ్లీ రౌడి సినిమా మోహన్ బాబుతో పాటు దివ్య భారతికి కూడా మంచి పేరు తెచ్చి పెట్టింది.
అసెంబ్లీ రౌడీ సినిమాతోనే మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా మారగా, ఈ చిత్రాన్ని ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లోనే మోహన్ బాబు నిర్మించడం విశేషం. అయితే అసెంబ్లీ రౌడి సినిమా చూసిన వారంతా కూడా దివ్య భారతి, మోహన్ బాబు కాంబో బాగా వర్కౌట్ అయిందని కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలోని అందమైన వెన్నెలలోన అనే పాట కోసం భారీగా ఖర్చు పెట్టారు. ఇది ఎవర్గ్రీన్ మూవీగా నిలిచిపోయింది. అయితే అసెంబ్లీ రౌడీ విజయం సాధించగానే దివ్యభారతి కోసం టాలీవుడ్ లోని దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. తమ సినిమాలలో ఆమెని హీరోయిన్గా తీసుకునేందుకు ఎగబడ్డారు.
అయితే దివ్య భారతికి ఇతర భాషలలో డిమాండ్ ఎక్కువ కాబట్టి తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసింది. వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో నటించిన దివ్యభారతి మోహన్ బాబుతో రెండు సినిమాలు చేయడం విశేషం. అసెంబ్లీ రౌడీ ఈ ఇద్దరి కాంబోలో హిట్ కావడంతో చిట్టమ్మ మొగుడు అనే సినిమా చేశారు. ఈ కథ మాతృక కూడా తమిళ సినిమానే. అయితే ఈ సినిమాకి మోహన్ బాబు నిర్మాతగా కాకుండా వేరే నిర్మాతతో డబ్బులు పెట్టించాడు. ఈ సినిమా కథపై నమ్మకం లేకపోయిన, ఈ సినిమా తాను చేయాలని అంటే దివ్య భారతి హీరోయిన్ అయితేనే చేస్తానని మోహన్ బాబు అన్నాడు. ఆమెని హీరోయిన్గా తీసుకోవడం, సినిమాని తెరకెక్కించడం, విడుదలైన దారుణమైన పరాజయం మూటగట్టుకోవడం జరిగింది. దివ్యభారతి కోసం సినిమా చేసి నిర్మాతను మోహన్ బాబు నిండా ముంచేశాడు అనే టాక్ అప్పట్లో బాగా నడిచింది.