చిరంజీవిని క‌ల‌వ‌నివ్వ‌లేదు.. ఎన్టీఆర్‌ని క‌ల‌వ‌డానికి ప‌ట్టీలు అమ్మేశాన‌న్న నిహారిక‌

చిరంజీవిని క‌ల‌వ‌నివ్వ‌లేదు.. ఎన్టీఆర్‌ని క‌ల‌వ‌డానికి ప‌ట్టీలు అమ్మేశాన‌న్న నిహారిక‌

స్వ‌యంకృషితో ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవికి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇప్ప‌టికీ ఆయ‌న‌ని అభిమానించేవారు ఎక్కువే. ఇక నందమూరి తార‌క‌రామారావు న‌ట‌వార‌సుడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చి ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబ‌ల్ స్టార్ డం సంపాదించుకున్న జూనియ‌ర్ ఎన్టీఆర్. ఈ హీరోకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మ‌నంద‌రికి తెలిసిందే. అయితే టాలీవుడ్ ఇండ్ట్రీలో కాస్యూమ్ డిజైన‌ర్‌గా ప‌ని చేస్తున్న నిహారిక రెడ్డి ఓ సంద‌ర్భంలో ఎన్టీఆర్‌ని క‌లిసేందుకు ప‌ట్టీలు అమ్ముకుంద‌ట‌. ఇక చిరంజీవిని క‌లుద్దామ‌ని వెళితే వాచ్‌మెన్ గేటుబ‌య‌ట నుండే ఆమెని బ‌య‌కు పంపించేశాడ‌ట. తాజాగా ఆమె త‌న కెరీర్‌కి సంబంధించిన షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించి అంద‌రికి ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.

నిహారిక రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను ఇంటర్ లో ఉన్న సమయంలో త‌న‌ని వాళ్ల నాన్న ఒక హాస్టలో ఉంచి ఫీజు స‌రిగ్గా క‌ట్ట‌లేద‌ట‌. అయితే అదే స‌మ‌యంలో జూనియ‌ర్ న‌టించిన సాంబ మూవీ విడుద‌లైంది. అయితే అప్పుడు చ‌దువుకునే పిల్ల‌లకి స్కాలర్ షిప్స్ ఇస్తామని ప్రకటన చూసి చదువుకు కావాల్సిన ఫీజు తెచ్చుకోవాలని అనుకున్నానని నిహారిక చెప్పుకొచ్చింది ఇక ఎన్టీఆర్‌పై ఉన్న పిచ్చి అభిమానంతో నేను నా పట్టీలు, కమ్మలు అమ్మేసి ఎన్టీఆర్ ను కలవడానికి హైదరాబాద్ కు వచ్చిన‌ట్టు నిహారిక పేర్కొంది. అయితే హైద‌రాబాద్ వ‌చ్చిన తాను ఎన్టీఆర్‌ని క‌లిసేందుకు వారి ఆఫీసుకి వెళ్ల‌గా అప్పుడు ఆయ‌న న‌టించిన సినిమా ఫ్లాప్ కావ‌డంతో డిప్రెష‌న్‌లో ఉన్నార‌ని, అయితే అక్క‌డ కొంత మంది ఇండ‌స్ట్రీ మంచిది కాద‌ని త‌నకు చెప్పార‌ని, అప్పుడు త‌న వ‌య‌స్సు 15 ఏళ్లు మాత్ర‌మే అని నిహారిక రెడ్డి పేర్కొంది

ఇక చిరంజీవి ఇంటికి వెళ్ల‌గా , వాచ్ మేన్ గేటు దాటి ఇంట్లోకి కూడా పోనివ్వ‌లేద‌ని నిహారిక చెప్పుకొచ్చారు. అనంత‌రం చంద్ర‌బాబుని క‌ల‌వాల‌ని ఎన్టీఆర్ భవన్ కు వెళ్లాను. అక్క‌డే ఏడు రోజులు ఉన్నానని నిహారిక రెడ్డి పేర్కొన్నారు.చంద్రబాబు నాయుడు నా వాక్చాతుర్యం చూసి జెమిని టీవీ లో రిఫ‌ర్ చేయ‌డంతో నాకు జాబు వ‌చ్చింది. అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న నేను జాబ్‌లో జాయిన్ కాలేక‌పోయాన‌ని నిహారిక పేర్కొంది. ప్ర‌స్తుతం నిహారిక చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.