శివాజి జెన్యూన్ కాదు.. బిగ్ బాస్ హౌజ్‌లో ఇంజ‌క్ష‌న్స్, పిల్స్ వాడానంటూ షాకింగ్ కామెంట్స్

శివాజి జెన్యూన్ కాదు.. బిగ్ బాస్ హౌజ్‌లో ఇంజ‌క్ష‌న్స్, పిల్స్ వాడానంటూ షాకింగ్ కామెంట్స్

బిగ్ బాస్ సీజ‌న్ 7 తెలుగులో గ్రాండ్ సక్సెస్ కాగా, ఇందులో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా, అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. టాప్ 5లో నిలిచిన ఒకే ఒక్క లేడి కంటెస్టెంట్‌గా ప్రియాంక జైన్ నిలిచింది. అయితే బిగ్ బాస్ సీజ‌న్ 7 పూర్తి అయి చాలా రోజులే అవుతున్నా కూడా ఈ షోకి సంబంధించి అందులో పాల్గొన్న కంటెస్టెంట్స్‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.తాజాగా ప్రియాంక జైన్ చేసిన సంచ‌ల‌న కామెంట్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. త‌న‌కు హౌజ్‌లో ఉన్న‌ప్పుడు స‌రిగ్గా ఆరోగ్యం బాగోలేదు అని చెప్పుకొచ్చింది. ఇంజక్షన్స్, పిల్స్ వాడాను. నా పనులు నేను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు హౌస్లో ఉన్న వాళ్లకు పనులు చేసి పెట్టలేదని హైలెట్ చేశారు.

అనారోగ్యం కారణంగా నేను ఒక రోజు రోటీలు ఉదయానికి దాచుకున్నాను. దానిని బాగా హైలైట్ చేసి చూపించారు. నేను దాచుకోక‌పోతే వాటిని స్పై బ్యాచ్ తినేస్తారు. వారు రాత్రి తిని కూడా కొన్ని రోటీలు ఉద‌యానికి దాచుకుంటారు. నేను దీనిపై మాట్లాడ‌గా, వాటిని ఎడిట్ చేసి చూపించారు. షోలో వాటి గురించి చూపించి ఉంటే నేనే విన్నర్ అయ్యేదాన్ని. అందరూ వంద శాతం ఇస్తే నేను వెయ్యి శాతం ఇచ్చాను. నిజానికి విన్నర్ నేనే కావాలి. గ్రూప్ గా ఆడటం వలన టైటిల్ దూరమైంది అంటే నేను నిజంగా న‌మ్మ‌ను. గౌత‌మ్ గురించి స్టాండ్ తీసుకుంటే దానిని చాలా హైలైట్ చేశారు. ఫ్రెండ్ క‌న్నా బ్ర‌ద‌ర్ రిలేష‌న్‌ని ఎక్కువ విలువ ఇవ్వ‌డం త‌ప్పా అని ప్ర‌శ్నించింది ప్రియాంక‌.

నేను హౌస్లో ఎలాంటి స్ట్రాటజీలు ప్లే చేయలేదు. అలా చేసి ఉంటే టాప్ లో ఉండేదాన్ని. కొందరు పనులు చేయకుండా ప్రశాంతంగా స్ట్రాటజీలు ప్లే చేస్తూ గేమ్ ఆడారు. నేను అడిగిన కొన్ని ప్రశ్నలకు శివాజీ వద్ద సమాధానం లేదు. నేను త‌ప్పు చేయ‌క‌పోయిన చేసిన‌ట్టు చెప్పేవారు. ఆయ‌న‌కి నేను ద‌గ్గ‌ర కావాల‌ని చూసిన దూరం పెట్టేవారు. ఆయ‌న నిజంగా జెన్యూన్ కాదు. ఆయ‌న ఏంటో హౌజ్‌లో ఉన్న మాకు తెలిసింది. ఎప్పుడూ మాస్క్ తోనే ఉన్నాడు. వంద రోజులు కాదు వెయ్యి రోజులు అయినా అలానే నటించగలడు… అంటూ ప్రియాంక.. శివాజి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. మ‌రి దీనిపై మ‌నోడు ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.