రాజ‌మౌళికి ముందు జాగ్ర‌త్త ఎక్కువే.. సంపాదించిన డ‌బ్బుతో ఏం చేస్తున్నాడో తెలుసా?

రాజ‌మౌళికి ముందు జాగ్ర‌త్త ఎక్కువే.. సంపాదించిన డ‌బ్బుతో ఏం చేస్తున్నాడో తెలుసా?

ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడుగా మంచి పేరు సంపాదించుకున్నారు రాజ‌మౌళి. . బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్న జ‌క్క‌న్న ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క ఫ్లాప్ కూడా చ‌వి చూడ‌లేదు. చిన్న సినిమా అయిన పెద్ద సినిమా అయిన చాలా జాగ్ర‌త్త‌గా ప్లాన్ చేసి నిర్మాత‌కి లాభాల పంట పండేలా చేస్తాడు. ఇక ఇటీవ‌లి కాలంలో రాజ‌మౌళి త‌న సినిమా రెమ్యున‌రేష‌న్ కూడా అమాంతం పెంచేసి కోట్లు కూడ‌బెడుతున్నాడు. రెమ్యున‌రేష‌న్ కాకుండానే లాభాల్లో కూడా కొంత వాటా తీసుకుంటున్నాడు జక్క‌న్న‌. అయితే ఇంత సంపాదిస్తున్న రాజమౌళి ఆ డబ్బును ఏం చేస్తున్నారు? ఎక్కడ పెట్టుబడిగా పెడుతున్నారు? డబ్బులను ఎలా ఖర్చుచేస్తారు? అని అంద‌రు చ‌ర్చ‌లు మొద‌లు పెట్ట‌డం స్టార్ట్ చేశారు.

ఫిలిం న‌గ‌ర్ స‌మాచారం మేర‌కు రాజ‌మౌళి సంపాదించిన మొత్తాన్ని ఫుడ్ బిజినెస్ లో, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతున్నార‌ని టాక్ న‌డుస్తుంది. భవిష్యత్తులో సినిమాల నుంచి విరమించుకున్న తర్వాతకూడా ఎటువంటి ఆదాయం లేకుండా ఉండకూడదని, రెగ్యులర్ గా ఆదాయాన్ని సృష్టించుకోవాలనే విధంగా రాజ‌మౌళి ఇలాంటి ప్లాన్ చేశాడ‌ని చెబుతున్నారు.రాజ‌మౌళి ఆలోచ‌న విధానాన్ని ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంసిస్తున్నారు. గ‌తంలో రాజమౌళి భార్య రమా రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో ..రాజమౌళి డబ్బుకు చాలా ప్రాధాన్యతనిస్తారని, ఎంత సంపాదిస్తున్నప్పటికీ ఖర్చు చేసే ప్రతి రూపాయిని దగ్గరుండి లెక్కిస్తుంటారని చెప్పుకొచ్చారు. డ‌బ్బు పోతే తిరిగి రాదని, దాన్ని భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవాలనే ఆలోచనతో ఆయ‌న ఎప్పుడు ఉంటార‌ని ఆమె పేర్కొన్నారు.

ఇక రాజ‌మౌళి- మ‌హేష్ బాబు కాంబోలో త్వ‌ర‌లో క్రేజీ ప్రాజెక్ట్ రూపొందుతుంది. ఈ సినిమా కోసం ప్ర‌తి ఒక్క‌రు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కోసం మ‌హేష్ ఎన్నేళ్లు స‌మ‌యం కేటాయిస్తాడా అని ముచ్చ‌టించుకుంటున్నారు. సాధారణంగా రాజమౌళితో సినిమా మొదలుపెట్టాక హీరోలకు ఇంకే ధ్యాస ఉండదు.. అలా ఉండే ఛాన్స్ కూడా ఇవ్వరు దర్శక ధీరుడు. 2024 సెకండ్ హాఫ్‌లో SSMB29 మొదలు కానుండ‌గా, ఈ చిత్రం 2026 చివర్లో లేదంటే 2027లోనే రానుంది. మరి ఈ సినిమాతో వారు ఎలాంటి అద్భుతాలు చేస్తారో చూడాలి.