నేను బిడ్డని కనలేను..ఆ బాధ అనుభవించిన వారికే తెలుస్తుందంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ఒకప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపిన అందాల భామ రాణీ ముఖర్జీ.ఈ అమ్మడు సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె గ్లామర్ పాత్రలతో పాటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలోను నటించి మెప్పించింది. 1998 నుండి రాణీ ముఖర్జీ ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలలో నటించి అలరించింది. ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగిదంటే అందులో ఆదిత్య చోప్రా హస్తం కూడా తప్పక ఉంటుంది. ఆమెని చాలా చిత్రాలకి ఆదిత్య చోప్రా రికమెండ్ చేశారు. అయితే రాణీ ముఖర్జీ 2014లో ఆదిత్య చోప్రాని వివాహం చేసుకుంది. ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిలిమ్స్ అధినేత అనే విషయం తెలిసిందే. అయితే ఈ జంటకి 2014లో ఒక కుమార్తె జన్మించింది.
పెళ్లి తర్వాత సినిమాలకి కాస్త దూరంగా ఉన్న రాణీ ముఖర్జీ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాణీ ముఖర్జీ తన జీవితంలో అత్యంత విషాదమైన సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఏడేళ్లుగా తాను మనసులోనే పెట్టుకోగా, ఎట్టకేలకి రివీల్ చేసింది. ఏడేళ్లుగా మేము రెండో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నా కూడా అది సాధ్యం కావడం లేదు. తొలి బిడ్డకి తోబుట్టువులని ఇవ్వలేకపోయాననే బాధ నాకు ఇప్పటికీ ఉందని రాణీ ముఖర్జీ పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో తాను మరో బిడ్డను కోల్పోయానని.. ఇక నాకు మరో బిడ్డ పుట్టే అవకాశం లేదంటూ రాణీ చెప్పుకొచ్చింది.
గర్భంలోనే శిశువుని కోల్పోతే తల్లి పడే వేదన ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించానని రాణీ ముఖర్జీ తెలియజేసింది. నేను పైకి కనిపించే అంత యంగ్ కాదు, ఇప్పుడు నా వయస్సు 46 ఏళ్లు. నేను ఇక ఇప్పుడు కనలేను. అయితే నా కూతురు అధీరా బంగారు తల్లి. తనవల్లే నేను సంతోషంగా ఉన్నానని తెలియజేసింది.రాణీ ముఖర్జీ హలో బ్రదర్, హర్ ది జో ప్యార్ కరేగా, ప్యార్ దీవానా హోతా హై వంటి అనేక చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇప్పుడు ఆమె సినిమాలు లేదంటే వెబ్ సిరీస్‌లలో అయిన నటించాలని అనుకుంటుంది.