నేడు రామ్ చరణ్ బర్త్ డే.. మార్మోగుతున్న సోషల్ మీడియా.. ఆయన తల్లి ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి షాక్

మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నాడు రామ్ చరణ్. చిరు తనయుడు సినీ పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాడని చెప్పినప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక ఆలోచన ఉండేది. చిరులో సగభాగమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడా అని. కాని ఆయన తన పర్‌ఫార్మెన్స్, బిహేవియర్‌తో మెగా పవర్ స్టార్‌గా ప్రతి ఒక్కరి గుండెలలో చెరగని ముద్ర వేసుకున్నారు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుత చిత్రంతో ఇండస్ట్రీకి డెబ్యూ ఇచ్చిన రామ్ చరణ్ ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమాతో అతి పెద్ద హిట్ దక్కించుకున్నాడు. ఇక ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వెళ్లాడు.
రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్‌ని ఎంత మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని చూపించి అదరహో అనిపిచాడు చరణ్. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ ఎల్లలు దాటింది.గ్లోబల్ స్టార్‌గా ఆయనకి గుర్తింపు దక్కింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సీ 16 మూవీ చేయనున్నాడు. ఈ రెండు సినిమాలతో రామ్ చరణ్ కి మరింత మంచి పేరు రావడం ఖాయంగా చెప్పవచ్చు. ఈ రెండు సినిమాల తర్వాత సుకుమార్‌తో కలిసి కూడా ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్. ప్రశాంత్ నీల్‌తో కూడా సినిమా చేయనున్నట్టు టాక్.
అయితే నటుడిగానే కాక నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నాడు చరణ్. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీతో పాటు తన ఫ్రెండ్స్ తో కలిసి మెగా V సెల్యులాయిడ్ నిర్మాణ సంస్థల్ని స్థాపించి మంచి సినిమాలని రూపొందిస్తున్నాడు. నేడు చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక రామ్ చరణ్ తల్లి అయితే ఒక రోజు ముందే ఓ భారీ గిఫ్ట్ ఇచ్చారు. చరణ్ బర్త్ డే సందర్భంగా అత్తమ్మాస్ కిచెన్ సంస్థ తరపున అపోలో లోని ఆలయంలో 500 మంది భక్తులకు అన్నదానం చేశారు సురేఖ. ఆమె స్వయంగా వండి.. అక్కడివారికి వడ్డించి.. దగ్గరుండి అన్ని చూసుకున్నారు… ఈ కార్యక్రమానికి చిన్నజియ్యర్ స్వామి హాజరు అయ్యారు. అయితే రామ్ చరణ్ ఈ రోజు బర్త్ డే సందర్భంగా తిరుపతి వెళ్లార . ఉపాసన, క్లీంకారతో కలిసి అక్కడికి వెళ్లిన చరణ్ అక్కడ శ్రీవారి ఆశీస్సులు తీసుకొని అనంతరం తన బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకోనున్నారు.