చాలా ఏళ్లుగా అతనితో రిలేషన్.. అంత ఈజీగా వదిలిపెట్టనంటూ ప్రియుడిన్ని పరిచయం చేసిన తాప్సీ

సొట్టబుగ్గల సుందరి తాప్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఝమ్మందినాదం మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు చిత్రాలలో నటించింది. అయినప్పటికీ మంచి సక్సెస్ అందుకోలేకపోయింది. వీర, దరువు, మొగుడు, గుండెల్లో గోదారి, షాడో… ఇలా పలు తెలుగు చిత్రాలు చేయగా, అవి నిరాశపరచడంతో బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ వైవిధ్యమైన సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ఆమె స్టేటస్ మరింత ఎదగడంతో పాటు టాప్ హీరోయిన్ జాబితాలో చేరింది.
తాప్సీ నటించిన పింక్, బద్లా వంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. డంకీ చిత్రంలో షారుఖ్ ఖాన్ కి జంటగా ఛాన్స్ కొట్టేసింది. ఇందులో తాప్సీ పన్ను నటనకు ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం పలు చిత్రాలతో తాప్సీ పన్ను బిజీగా ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ ఎప్పటి నుండో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ఆటగాడు మాథిస్ బోతో ప్రేమాయణం నడిపిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు ఈ విషయంపై క్లారిటీ ఇవ్వని తాప్సీ తాజాగా అసలు విషయాలు చెప్పారు. తను బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కొత్తల్లోనే మాథిస్ బోతో ప్రేమలో పడ్డానని ఒప్పుకున్నారు. పదేళ్లుగా తమ బంధం చాలా స్ట్రాంగ్‌గా ఉందని.. ఇద్దరం సంతోషంగా ఉన్నామని , ప్రేమ, పెళ్లి విషయంలో కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉండటం వల్లే ఈ విషయం రివీల్ చేయలేదని వెల్లడించారు తాప్సీ.
ఇన్నేళ్లు ఆయన పక్కనే నేను ఉన్నాను. మాథిస్ తో రిలేషన్ సంతోషాన్ని ఇస్తుంది. మాథిస్ తో విడిపోవాలి, మరొకరిని ప్రేమించాలనే ఆలోచన రాలేదు. ప్రేమ పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఈ విషయం బయటపెట్టలేదని తాప్సీ చెప్పుకొచ్చింది. మరి ఈ అమ్మడు ఎప్పుడు అతడిని పెళ్లి చేసుకుంటుంది అనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం తాప్సీ వహ్ లడ్‌కీ హై కహా, ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా, ఖేల్ ఖేల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.