రేపటికి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ.. ప్రారంభమైన కేబినెట్ భేటీ

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.

రేపటికి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ.. ప్రారంభమైన కేబినెట్ భేటీ

 తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకాగానే ఇప్పటిదాకా ప్రమాణా స్వీకారం చేయని పలువురు శాసన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్ధిన్ ఒవైసీ ప్రమాణాం చేయించారు. అనంతరం స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ప్రక్రియ పూర్తి చేశారు.


స్పీకర్‌గా ప్రసాద్ ఎన్నిక పట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సహా మంత్రులు, ప్రతిపక్ష సభ్యులంతా తమ అభినందనలు తెలుపుతు ప్రసంగించారు. అనంతరం స్పీకర్ అసెంబ్లీని రేపటికి వాయిదా వేశారు. రేపు ఉదయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై, శ్వేత పత్రంపై సభలో చర్చ జరుగనుంది.రేపటికి వాయిదా పడిన తెలంగాణ అసెంబ్లీ


ప్రారంభమైన కేబినెట్ భేటీ

మరోవైపు రేపు ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంకు సంబంధించి చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ భేటీ కొనసాగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీకి మంత్రులంతా హాజరయ్యారు. భేటీలో రేపు గవర్నర్ ప్రసంగంతో పాటు ఆర్ధిక పరిస్థితులపై చర్చ సందర్భంగా అనుసరించాల్సిన విధానాలపై చర్చ సాగుతుంది