బాలయ్య సినిమా కోసం ముగ్గురు హీరోయిన్స్.. క్రేజీ అప్‌డేట్‌కి ఫ్యాన్స్ పిచ్చ హ్యాపీ

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆయన వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులని తెగ అలరిస్తున్నారు. బాలయ్య చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఒక సినిమాని మించి మరొకటి అన్నట్టు ఆయన సినిమాలు కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’ వంటి చిత్రాలతో వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలకృష్ణ ఇప్పుడు బాబి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం భారీ యాక్షన్ కమ్ ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందుతుంది. బాలయ్య మాస్ ఇమేజ్ కి..బాబి మాస్ కంటెంట్ తోడైతే! సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో మనం ఊహించుకోనక్కర్లేదు.
చిత్రం లాంచ్ అయి నాలుగైదు నెలలు అవుతున్నా కూడా ఈ సినిమా నుండి అప్‌డేట్స్ పెద్దగా రావడం లేదు. తాజా సమాచారం. ప్రకారం ఇందులో ముగ్గురు కథానాయికలని ఎంపిక చేసినట్టు టాక్ నడుస్తుంది. హీరోయిన్‌గా అందాల ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి పేరు వినిపిస్తోంది. అలాగే ఓ అగ్ర హీరోయిన్ కూడా నటిస్తుందని, మరో కీలక పాత్రలో ఇంకో నటిని ఎంపిక చేశారని చెప్పుకొస్తున్నారు. మొత్తం ముగ్గురు హీరోయిన్స్‌తో బాలయ్య సందడి చేయనుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఏడాది మొదటి ప్రధమార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బాబీ తెరకెక్కించే చిత్రంలోనూ డిఫరెంట్ లుక్ ను ట్రై చేస్తున్నారంట. బాలయ్య మార్క్ యాక్షన్ ఏమాత్రం తగ్గకుండా స్టోరీ డిజైన్ చేసినట్లు చెబుతున్నారు. యాక్షన్ స్టోరీలోనే ఫ్యామిలీ ఎమోషన్ కి దర్శకుడు పెద్ద పీట వేసినట్లు సమాచారం. అలాగే పొలిటిక్స్ బ్యాక్ డ్రాప్ లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలుంటాయట. ఈ సినిమా అంచనాలని మించి ఉంటుందని, ఈ చిత్రంతో బాలయ్య మరో మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవడం ఖాయం అని చెప్పుకొస్తున్నారు.