ఒక్క మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు.. వారెవరంటే..!

టాలీవుడ్ సినీ పరిశ్రమ స్థాయి పెరిగింది. సీనియర్ హీరోలు సైతం వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులని అలరించే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా సంక్రాంతికి వచ్చిన నాగార్జున కూడా మంచి హిట్ దక్కించుకున్నారు. అయితే యువ హీరోలు మాత్రం మంచి హిట్ అందక నిరాశలో ఉన్నారు. నితిన్.. అఖిల్.. వరుణ్.. రామ్ లాంటి హీరోలు సక్సెస్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. ముందుగా లవర్ బాయ్ నితిన్ విషయానికి వస్తే.. ఇటీవల ఆయన చేసిన మాచర్ల నియోజకవర్గం బెడిసికొట్టింది. రీసెంట్గా విడుదలైన ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్ కూడా దారుణంగా విఫలమైంది. కనీసం 2024లో అయినా నితిన్ కోరుకునే ఎక్స్ ట్రార్డినరీ సక్సెస్ వస్తుందా లేదా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక అక్కినేని హీరో నాగ చైతన్యకు సిల్వర్‌స్క్రీన్ మీద పండగలాటిసినిమా వచ్చి చాన్నాళ్లయింది. థాంక్యూ ,కస్టడీ చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. దాంతో వెబ్ సిరీస్ లు కూడా స్టార్ట్ చేశాడు . దూత వెబ్ సిరీస్ మాత్రం సూపర్ హిట్ అయ్యింది ఇక ప్రస్తుతం తండేల్ అనే చిత్రం చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తుండగా, ఈ మూవీపై బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు . ఇక చైతూ సోదరుడు అఖిల్ పరిస్థితి అలానే ఉంది. ఆయనకి ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు. చివరిగా వచ్చిన ఏజెంట్ బెడిసి కొట్టింది. 2024 అయిన మనోడికి కలిసొస్తుందో లేదో చూడాలి. ఇక ఎనర్జిటక్ హీరో రామ్ పోతినేని.. అప్పుడెప్పుడో ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో హిట్ కొట్టాడు. తర్వాత వచ్చినవన్నీ ఫ్లాపులుగానే నిలిచాయి. ఇప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంపైనే బోలడెన్ని హోప్స్ పెట్టుకున్నాడు.
శర్వానంద్ కూడా హిట్టు ముఖం చూసి చాలా కాలం అయ్యింది. మారుతీ డైరెక్షన్ లో వచ్చిన మహానుభావుడు సినిమా తరువాత మరో హిట్ శర్వానంద్ అందుకోలేదు. ఇప్పుడు మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. శ్రీరామ్ ఆధిత్య డైరెక్షన్ తో తన 35వ సినిమా చేస్తుండగా, ఈ మూవీపైనే బోలెడన్ని అంచనాలు పెట్టుకున్నారు. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ తరువాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు. ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ చిత్రంతో అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నాగ శౌర్యకి ఇటీవలి కాలంలో ఒక్క సక్సెస్ లేదు. పంజా వైష్ణవ్, కార్తికేయా, సందీప్ కిషన్ లాంటి మరికొంత మంది హీరోలు కూడా సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మరి ఈ ఏడాది అయిన ఏ హీరో మంచి విజయాన్ని అందుకుంటాడు అనేది చూడాల్సి ఉంది.