Bajaj Pulsar N250 | మార్కెట్లోకి మరో కొత్త బైక్‌.. ఈ పల్సర్‌ వెరీవెరీ స్పెషల్‌..

  • By: Thyagi |    business |    Published on : Apr 11, 2024 10:07 AM IST
Bajaj Pulsar N250 | మార్కెట్లోకి మరో కొత్త బైక్‌.. ఈ పల్సర్‌ వెరీవెరీ స్పెషల్‌..

Bajaj Pulsar N250 : యువతకు బైకులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొత్త బైకు కనిపిస్తే చాలు ట్రయల్‌ కొట్టి చూస్తారు. అందులోనూ పల్సర్ బైకు యూత్‌లో మరింత క్రేజ్‌ ఉంది. ఈ క్రమంలో ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్.. తాజాగా అడ్వాన్స్‌డ్‌ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ బైకు ఫీచర్స్ వెరీవెరీ స్పెషల్ అనే టాక్‌ వినిపిస్తోంది. బజాజ్ కంపెనీ Bajaj Pulsar N250 పేరుతో ఈ అడ్వాన్స్‌డ్‌ వర్షన్ పల్సర్ బైకును లాంచ్ చేసింది. మరి ఆలస్యం దేనికి..? ఈ బైకులోని స్పెషల్ ఫీచర్స్‌ ఏమిటి..? ధర ఎంత తదితర వివరాలు తెలుసుకుందాం..

బజాజ్‌ కంపెనీ గతంలో చాలా బైకులను లాంచ్ చేసింది. ఆ పరంపరలో భాగంగానే ఇప్పుడు Bajaj Pulsar N250ని లాంచ్ చేసింది. అంతేకాదు త్వరలోనే పల్సర్ F250ని కూడా లాంచ్ చేసేందుకు బజాజ్‌ సిద్ధమవుతోంది. ఈ బైకు ‘టర్న్ బై టర్న్’ నావిగేషన్‌పాటు బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన సరికొత్త పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వచ్చింది. ఈ కొత్త బైకుకు 140 సెక్షన్ బ్యాక్‌ టైర్ ఉంది. ఇది రైడ్ ఎబిలిటీని పెంచుతుంది. దీనిలో ఇంకా అనేక ఫీచర్స్ ఉన్నాయి.

ఇక ఈ బైకు ధర విషయానికొస్తే.. ఈ సరికొత్త బైకు మూడు రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. లాంచింగ్ సమయంలో రెండు రంగులే ఇచ్చినా ఆ తర్వాత మరో రంగుతో బైక్‌ను రూపొందించారు. దాంతో మొత్తం మూడు రంగుల్లో ఈ బైకులు వచ్చేశాయి. ఎరుపు, నలుపు, తెలుపు రంగుల్లో ఈ బైకులు మార్కెట్‌లోకి వచ్చాయి. ఈ కొత్త బైక్‌ షోరూమ్‌ ధర రూ.1,50,829 గా కంపెనీ నిర్ణయించింది.