స్టాక్స్ లో క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ ట్రెండ్
విధాత:స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ ట్రెండ్ నడుస్తుంది చాలా మంది ట్రేడింగ్ ఇన్వెస్టర్ లు దీనిని ఫాలో అవుతున్నారు. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి. దీని విలువ ఎంత. దీని వాడకం ఎలా.సాదారణ మానవునికి దీని అవసరం ఉంటుందో లేదో తెలుసుకుందాం. క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీ ,దీనిని క్రిప్టో మనీ ,క్రిప్టోగ్రఫీ కరెన్సీ , ఎన్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తారు వీటి విలువ డిమాండ్, సరఫరా […]

విధాత:స్టాక్ మార్కెట్ లో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ,బిట్ కాయిన్ ట్రెండ్ నడుస్తుంది చాలా మంది ట్రేడింగ్ ఇన్వెస్టర్ లు దీనిని ఫాలో అవుతున్నారు. అసలు ఈ క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి. దీని విలువ ఎంత. దీని వాడకం ఎలా.సాదారణ మానవునికి దీని అవసరం ఉంటుందో లేదో తెలుసుకుందాం.
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీ ,దీనిని క్రిప్టో మనీ ,క్రిప్టోగ్రఫీ కరెన్సీ , ఎన్క్రిప్షన్ కరెన్సీ అని కూడా పిలుస్తారు వీటి విలువ డిమాండ్, సరఫరా ఆధారంగా మారుతూ ఉంటుంది ఇది ఏ దేశానికీ చెందదు,ఏ నియంత్రణ సంస్థ పరిధిలోకీ రాదు. అచ్చమైన అంతర్జాతీయ కరెన్సీ. ఇది బ్లాక్ చైన్ ఇంకా డిజిటల్ సంతకాలు వంటి క్రిప్టోగ్రాఫిక్ సాధనాలపై ఆధారపడిన డిజిటల్ చెల్లింపు మార్గాలకు ఇవ్వబడిన పేరు . లావాదేవీల మాధ్యమాన్ని సృష్టించడానికి లావాదేవీలు , లావాదేవీ నియంత్రణ యూనిట్ల భద్రతను నిర్ధారించడానికి క్రిప్టోగ్రఫీ సూత్రాలను ఉపయోగిస్తోంది. డిజిటల్ ఆస్తుల మార్పిడికి ఒక మాధ్యమంగా ఉండే వంటి పనులకోసం రూపొందించబడింది, ఆర్థిక లావాదేవీలు సురక్షిత అదనపు యూనిట్ల ఉత్పత్తిని నియంత్రించడానికి,ఆస్తులను ధ్రువీకరించడం . ఇవి కేంద్రీకృత డిజిటల్ కరెన్సీ , సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థకు విరుద్ధంగా క్రిప్టోకరెన్సీలు వికేంద్రీకృత నియంత్రణను ఉపయోగిస్తాయి.
క్రిప్టోకరెన్సీలు (లేదా క్రిప్టోకరెన్సీలు) నెట్‌వర్క్‌లలో పీర్-టు-పీర్ (పి 2 పి) సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాయి, దీని నోడ్‌లు వినియోగదారుల కంప్యూటర్లతో తయారవుతాయి, ఇవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఈ కంప్యూటర్లలో పర్స్ ఫంక్షన్లను చేసే ప్రత్యేక ప్రోగ్రామ్‌లు నడుస్తాయి. ప్రస్తుతం వాటిని నియంత్రించే కేంద్ర అధికారం లేదు. లావాదేవీలు విడుదల నెట్‌వర్క్‌లో సమిష్టిగా జరుగుతాయి కాబట్టి “కేంద్రీకృత” నిర్వహణ లేదు. సాంప్రదాయ చెల్లింపు వ్యవస్థల ద్వారా ఈ రకమైన ఈ ప్రత్యేక లక్షణాలను వివరించలేము.ఒక రకమైన ప్రత్యామ్నాయ కరెన్సీ లేదా డిజిటల్ కరెన్సీ . క్రిప్టోకరెన్సీలను కేంద్ర బ్యాంకులు వికేంద్రీకరించాలి లేదా కేంద్రీకరించాలి అనే వివాదం ఉంది.కేంద్రీకృత వ్యవస్థ కంటే వికేంద్రీకృత వ్యవస్థ సైబర్ దాడులకు లేదా కార్యాచరణ సంఘటనలకు ఎక్కువ నిరోధకతను కలిగి ఉంటుంది ఎందుకంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నోడ్లు పనిచేయడం ఆగిపోయినప్పుడు కూడా బ్యాగ్రౌండ్ పనిచేస్తూనే ఉంటుంది కాబట్టి ఇది సైబర్ దాడుల నుండి పటిష్టంగా ఉంటుంది.
క్రిప్టోకరెన్సీ విషయానికి వస్తే, మనస్సులో కి వచ్చే మొదటి విషయం బిట్ కాయిన్ . కానీ బిట్ కాయిన్లతో పాటు వివిధ సాఫ్ట్ వేర్ డెవలప్ మెంట్ సర్వీసుల సాయంతో దాదాపు వెయ్యి రకాల డిజిటల్ మనీని క్రియేట్ చేస్తున్నారు వాటిలో కొన్ని.
నేం Nem – ఒక ప్రత్యేక కోడ్ తో కరెన్సీ,డ్యాష్ Dash – అనామధేక క్రిప్టోకరెన్సీ,లైట్ కాయిన్ Litecoin – వేగవంతమైన లావాదేవీల కొరకు డిజిటల్ మనీ,రిపుల్ Ripple – అత్యంత వేగవంతమైన క్రిప్టోకరెన్సీ,ఇథరం Ethereum (ETH) – స్మార్ట్ కాంట్రాక్ట్ ల యొక్క కరెన్సీ
వీటి వాడుక, లావాదేవీలు
ఎలక్ట్రానిక్ లావాదేవీలకు బిట్‌కాయిన్లు వాడొచ్చు. బిట్‌కాయిన్లతో ఏది కొన్నా ఆ లావాదేవీ తక్షణం డిజిటల్ రూపంలో ‘లాగ్’ అవుతుంది. ఈ ‘లాగ్’లో ఎప్పుడు కొన్నారు? లావాదేవీ జరిగాక ఎవరి దగ్గర ఎన్ని కాయిన్లున్నాయి? వంటివన్నీ అప్‌డేట్ అయిపోతాయి. బిట్‌కాయిన్‌కు సంబంధించిన ప్రతి ఒక్క లావాదేవీ ఈ లాగ్‌లో అప్‌డేట్ అవుతుంటుంది. ఈ వ్యవస్థే బ్లాక్ చెయిన్. ఈ చెయిన్‌లో మొదటి నుంచి అప్పటిదాకా జరిగిన ప్రతి లావాదేవీ నమోదవుతుంది. బ్లాక్‌చెయిన్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ లావాదేవీలు పొల్లుపోకుండా జరిగాయో లేదో చూసే వారు ఉంటారు వారిని మైనర్స్ అంటారు. ఒకరకంగా చెప్పాలంటే లావాదేవీలకు ఆమోదముద్ర వేసేవారన్న మాట. ఇలా చేసినందుకు వీరికి వ్యాపారుల నుంచి కొంత ఫీజు ముట్టుతుంది.బిట్‌కాయిన్‌లో 10 కోట్లవ వంతు విలువను సతోషిగా పిలుస్తారు. అంటే 10 కోట్ల సతోషిలు ఒక్క బిట్‌కాయిన్‌కు సమానం. బిట్ కాయిన్ ట్రేడింగ్‌కు బిట్ స్టాంప్ (అమెరికా), ఓకే కాయిన్ (చైనా) సహా ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు, ఎక్స్ఛేంజీలు ఉన్నాయి. క్రయవిక్రయాలు మాత్రం వ్యాలెట్ ద్వారానే జరుగుతుంటాయి. ఇందుకు ప్రత్యేక వ్యాలెట్లు ఉంటాయి.మాఫియా కార్యకలాపాలు నిర్వహించేవారు, హ్యాకర్లు ఈ లావాదేవీలను ఎక్కువగా నిర్వహిస్తుంటారు.
మారకం విలువ
ప్రస్తుతం ఒక బిట్‌కాయిన్ మారకం విలువ 2000 అమెరికన్ డాలర్లు. ఇటీవల ఈ విలువ 3200 డాలర్లను తాకింది కూడా!! ఎందుకంటే బంగారం మాదిరిగా బిట్‌కాయిన్లూ అరుదైనవే. వీటిని సూపర్ కంప్యూటర్ల ద్వారా అది కూడా పరిమితంగానే సృష్టించగలరు. అందుకే బిట్‌కాయిన్ల ట్రేడింగ్‌లో స్పెక్యులేషన్ పెరిగింది. పెపైచ్చు వర్డ్‌ప్రెస్, ఓవర్‌స్టాక్.కామ్, రెడ్డిట్, ఒకే క్యుపిడ్, వర్జిన్ గెలాక్టిక్, బైదు లాంటి సంస్థలన్నీ ఆన్‌లైన్ షాపింగ్‌కు బిట్‌కాయిన్లను అనుమతిస్తున్నాయి. అందుకే వీటిని కావాలనుకునేవారు పెరిగారు. దీంతో బిట్‌కాయిన్ల మారకం రేటు రయ్యిమని పెరిగింది. ఇంతలో కొన్ని దేశాలు దీని వాడకంపై పరిమితులు విధిస్తామని చెప్పటం, మారకం ఎక్స్ఛేంజీలపై హ్యాకర్లు దాడులు చెయ్యటంతో విలువ కొంత పడింది. ప్రస్తుతం చెలామణిలో ఉన్న బిట్‌కాయిన్ల మార్కెట్ విలువ సుమారు 8.4 బిలియన్ డాలర్లుంటుంది. బిట్‌కాయిన్ లాంటి వర్చువల్ కరెన్సీలు 70కి పైగా ఉండగా వీటి మొత్తం విలువ దాదాపు 13 బిలియన్ డాలర్లుంటుందని అంచనా. దీన్లో సింహభాగం బిట్‌కాయిన్లదే కనక దీనికంత ప్రాధాన్యం. 2009లో బిట్‌కాయిన్ విలువ అమెరికా సెంటు విలువ కంటే కూడా తక్కువ. 2011లో డాలరుకు సమాన విలువకు చేరింది.2017 ప్రారంభంలో 800- 1000 డాలర్ల (రూ.60,000- 70,000) మధ్య ఉన్న బిట్‌కాయిన్ విలువ డిసెంబరులో 20,000 డాలర్ల (సుమారు రూ.15,00,000) చేరువకు వెళ్లింది. అంటే ఇంచుమించు 2000 శాతం పెరిగింది.చికాగో మర్కంటైల్ ఎక్స్ఛేంజీ (సీఎంఈ) గ్రూపు, అమెరికా నాస్‌డాక్ ఎక్స్ఛేంజీలు బిట్‌కాయిన్‌కు ఫ్యూచర్ ట్రేడింగ్‌ను ప్రారంభించడంతో ఆ సమయంలో బిట్‌కాయిన్‌కు ట్రేడర్ల నుంచి ఆదరణ పెరిగింది. వివిధ దేశాల సెంట్రల్ బ్యాంక్‌లు విధించిన ఆంక్షల ప్రభావంతో ఆ తర్వాత తిరోగమన బాట పట్టింది.ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ దాదాపు 6500 డాలర్ల వద్ద ఉంది. భారత కరెన్సీలో చెప్పదలిస్తే రూ.4.5 లక్షలు
భద్రత
ఇది అన్నిటికన్నా ప్రధానమైన ప్రశ్న. ఎందుకంటే ఇటీవలే కెనడాలోని అల్బెర్టాలో ఉన్న ఫ్లెక్స్‌కాయిన్ బ్యాంక్‌పై హ్యాకర్లు దాడిచేశారు. దాని హాట్ వాలెట్‌లోని దాదాపు 7లక్షల డాలర్ల విలువచేసే బిట్‌కాయిన్లను దోచేశారు. దీంతో ఆ బ్యాంకు తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపేసింది. అంతకు నాలుగురోజుల కిందటే జపాన్‌కు చెందిన మౌంట్ గాక్స్ ఎక్స్ఛేంజీ తన వాలెట్ నుంచి హ్యాకర్లు ఏకంగా 480 మిలియన్ డాలర్ల విలువ చేసే బిట్‌కాయిన్లను దోచేశారని పేర్కొంటూ బిట్‌కాయిన్ అభిమానుల కలలు చెదరగొట్టింది. అందుకని తమకు దివాలా రక్షణ కల్పించాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. బిట్‌కాయిన్ల విషయంలో అన్నిటికన్నా ప్రధానమైనది ఆన్‌లైన్ భద్రతే. యూజర్లంతా కలిసి లావాదేవీల్ని పర్యవేక్షిస్తూ ఉంటారని, ఎప్పటికప్పుడు ఎవరి దగ్గర ఎన్ని బిట్‌కాయిన్లున్నాయో అప్‌డేట్ అవుతుంటుందని చెప్పే వ్యవస్థ హ్యాకర్లను గుర్తించకపోతే ఇక నమ్మేదెలా? ఎవరు నమ్ముతారు ఇలాంటి కరెన్సీని.