స్వల్పంగా పెరిగిన బంగారం..స్థిరంగా వెండి
గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220పెరిగి రూ. 1,50,660కి వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,100 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,60,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
విధాత, హైదరాబాద్ : అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతుంది. గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 220పెరిగి రూ. 1,50,660కి వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,38,100 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,60,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
భవిష్యత్తులో పసిడి పుంజుకోవచ్చు..
ప్రస్తుతం అమెరికా-ఇరాన్ యుద్ధం వంటి పరిస్థితుల వల్ల స్వల్పకాలికంగా బంగారం తన జోరును కొనసాగించలేక పడుతూ లేస్తుంది. సాధారణంగా యుద్ధ సమయాల్లో బంగారం ధరలు పెరగాలి, కానీ ముడి చమురు ధరల పెరుగుదల, మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి వల్ల పెట్టుబడిదారులు తమ వద్ద ఉన్న బంగారం వంటి ఆస్తులను విక్రయించి నగదు నిల్వలను పెంచుకుంటున్నారు. దీనికి తోడు బలమైన అమెరికా డాలర్, ఫెడరల్ రిజర్వ్ కఠిన నిర్ణయాలు కూడా బంగారంపై అమ్మకాల ఒత్తిడిని పెంచుతున్నాయి.
జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ పెట్టుబడి బ్యాంకు డాయిష్ బ్యాంక్ నిర్వహించిన ఒక విశ్లేషణాత్మక అంచనాలో రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఊహించని స్థాయికి చేరవచ్చని అంచనా వేసింది. ఈ అంచనా ప్రకారం ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు తమ నిల్వలను అమెరికా డాలర్ల నుండి బులియన్ (బంగారం) వైపు మళ్లిస్తే.. రాబోయే ఐదేళ్లలో బంగారం ధర ఔన్సుకు 8 వేల డాలర్ల మార్కును తాకవచ్చు. ఇది ప్రస్తుత ధరలతో పోలిస్తే దాదాపు 80 శాతం పెరుగుదల కావడం గమనార్హం. గతంలో బంగారం కొనుగోళ్లు కేవలం చైనా, రష్యా, భారత్, టర్కీ వంటి దేశాలకే పరిమితం కాగా, ఇప్పుడు ఈ జాబితాలోకి కజకిస్తాన్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కూడా వచ్చి చేరడం కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram