పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 330పెరిగి రూ. 1,52,460 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300పెరిగి రూ. 1,39,750వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,75,000వద్ద కొనసాగుతుంది.

పెరిగిన బంగారం, స్థిరంగా వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా బౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగుతుంది. గురువారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 330పెరిగి రూ. 1,52,460 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300పెరిగి రూ. 1,39,750వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,75,000వద్ద కొనసాగుతుంది.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బంగారం ఎప్పుడూ ఒక సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతుంది. ప్రస్తుతం 2026 మే నెలలో అంతర్జాతీయ మార్కెట్ గమనాన్ని గమనిస్తే.. పసిడి ధరలు ఒక ఆసక్తికరమైన దశలో కొనసాగున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా చమురు, బంగారం మార్కెట్లను శాసిస్తున్నాయి. ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సాధారణంగా చమురు ధరలు పెరిగినప్పుడు ద్రవ్యోల్బణం పైకి ఎగబాకి వడ్డీ రేట్లపై ప్రభావం చూపుతుంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరియు బంగారం ధరల మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని, అలాగే ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు పెట్టుబడులపై చూపుతున్న ప్రభావాన్ని స్టేట్ స్ట్రీట్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్మెంట్ నివేదిక విశ్లేషించింది. ఈ నివేదిక ప్రకారం చమురు ధరలు గనుక బ్యారెల్‌కు 120 నుండి 140 డాలర్ల మధ్య స్థిరంగా కొనసాగితే, బంగారం ధర తాత్కాలికంగా ఔన్స్‌కు 4,000 డాలర్ల వరకు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు . అయితే, ఒకవేళ శాంతి చర్చలు ఫలించి చమురు ధరలు 80 డాలర్లకు పడిపోతే, బంగారం ధరలు వేగంగా 5 వేల డాలర్ల మార్కును దాటి, 5,500 డాలర్ల వరకు దూసుకుపోయే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.