మళ్లీ పడిపోయిన బంగారం, వెండి ధరలు

గురువారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,340 తగ్గి రూ. 1,51,480వద్ద ఆగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,150 తగ్గి రూ.138,850వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ. 2,60,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Apr 09, 2026, 12:21 pm IST
Read Time: 3 mins
మళ్లీ పడిపోయిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో తాత్కాలిక యుద్ద విరమణ ప్రకటన చేయడంత.. ఆ వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడటం వంటి పరిణామాలు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. గురువారం  బులియన్ మార్కెట్ లో  24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,340 తగ్గి రూ. 1,51,480వద్ద ఆగింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,150 తగ్గి రూ.138,850వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ. 2,60,000వద్ద కొనసాగుతుంది.

ఇజ్రాయెల్.. లెబనాన్‌పై దాడి చేయడంతో అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ప్రమాదంలో పడింది. కాల్పుల విరమణ తదనంతర పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తతలకు దారి తీయడంతో పెట్ఠుబడిదారులు డాలర్ మీదకు పెట్టుబడులను మళ్లించారు. దీంతో పసిడి ధరలు భారీగా పతనమయ్యాయి. ఈ పరిణామం కారణంగా, భారత మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో భారీ ఒడుదొడుకులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,720 డాలర్ల పైన ట్రేడ్ అవుతుండగా, స్పాట్ సిల్వర్ ఔన్సుకు 75 డాలర్ల దిగువన కొనసాగుతుంది.మరోవైపు, ముడి చమురు ధరలు 2% నుంచి 3% వరకు పెరిగాయి. బ్యారెల్‌కు 96-98 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. యుద్దం తీవ్రతరమైతే మళ్లీ బంగారం, వెండి ధరలు పడిపోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

అకిరా పుట్టినరోజు.. మార్క్ శంకర్ పునర్జన్మ: పవన్‌ భార్య లెజినోవా ఎమోషనల్‌
Student Suicide | త‌ల్లి మంద‌లించింద‌ని.. ఆరో త‌ర‌గ‌తి విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌