అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి పతనమయ్యాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 760 తగ్గి రూ.1,42,530 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 570 తగ్గి రూ.1,30,650 వద్దనిలిచింది. కిలో వెండి ధర సైతం రూ. 5,000 తగ్గి రూ. 2,35,000 తగ్గింది.
పశ్చిమాసియా సంక్షోభం మొదలు నుంచి బంగారం, వెండి ధరలు రోజురోజు మార్పులకు గురవుతున్నాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, డాలర్ బలం, ట్రెజరీ ఈల్డ్స్, ద్రవ్యోల్బణ గణాంకాలు, అలాగే మధ్యప్రాచ్య భౌగోళిక ఉద్రిక్తతలపై బంగారం, వెండి ధరలలో తీవ్ర హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ.. మార్కెట్‌లో తిరిగి కొనుగోళ్లు పెరిగితే MCX గోల్డ్ రూ.1.45 లక్షలు (10 గ్రాములు), MCX సిల్వర్ రూ.2.27 లక్షలు (కిలో) స్థాయిలను చేరుకునే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
