Livia Voigt | ప్రపంచంలోనే అతిపిన్న బిలియనీర్‌.. ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Livia Voigt | ప్రపంచంలోనే అతిపిన్న బిలియనీర్‌.. ఆమె ఆస్తుల విలువ ఎంతో తెలుసా..?

Livia Voigt : లివియా వొయిట్‌..! అమె బ్రెజిల్‌ దేశానికి చెందిన యువతి..! వయస్సు కేవలం 19 సంవత్సరాలు..! ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది..! అమె ఇంతవరకు ఎక్కడా ఉద్యోగం చేయలేదు..! అలాగని ఆమెకు ఎలాంటి వ్యాపారాలూ లేవు..! అయినా ఆమె కోట్ల రూపాయలకు అధిపతి అయ్యింది..! ప్రపంచంలోనే అతిపిన్న బిలియనీర్‌గా ఫోర్బ్స్‌ జాబితాలో చోటుదక్కించుకుంది..! ఉద్యోగం చేయకపోయినా, ఎలాంటి వ్యాపారాలు లేకపోయినా అదెలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే..

లివియా తాత వెర్నెర్‌ రికార్డో వొయిట్‌ బ్రెజిల్‌లో మరో ఇద్దరు వ్యాపారవేత్తలతో కలిసి డబ్ల్యూఈజీ (WEG) అనే కంపెనీని స్థాపించాడు. ఆ కంపెనీ ఆస్తుల విలువ కోట్లకు పెరిగింది. వెర్నెర్‌ రికార్డో వొయిట్‌కు వయసు మీదపడుతుండటంతో కంపెనీలోని తన వాటాను ఇటీవల తన వారసులకు పంచాడు. ఈ క్రమంలోనే లివియా వొయిట్‌ చేతికి కూడా వేలకోట్ల విలువ చేసే ఆస్తి వచ్చింది. దాంతో అతిపిన్న వయసులోనే ఫోర్బ్స్‌ బిలియనీర్ల జాబితాలో స్థానం సంపాదించి చరిత్ర సృష్టించింది.

ఇటీవల ఫోర్బ్స్‌ సంస్థ 33 ఏళ్ల లోపు వయస్సున్న 25 మంది యువ బిలియనీర్ల పేర్లతో ఒక విడుదలచేసింది. తాత ఇచ్చిన ఆస్తులవల్ల లివియా కూడా ఆ జాబితాలో చోటుదక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఆస్తుల విలువ 1.1 బిలియన్‌ డాలర్‌లు (దాదాపు రూ.9,165 కోట్లు). ఇలా వేలకోట్ల సంపదతో ప్రపంచంలో బిలియనీర్‌ అయిన అతిపిన్న వయస్కురాలిగా ఆమె పేరు రికార్డులకెక్కింది. అయితే కోట్లకు పడగలెత్తినా ఆమె ఇంకా కంపెనీ బోర్డులో సభ్యురాలిగా చేరలేదు. బ్రెజిల్‌ విశ్వవిద్యాలయంలో డిగ్రీ చదువుతోంది.